Breaking News

Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!

Published on Mon, 12/18/2023 - 08:28

బిగ్‍‌బాస్ 7 అయిపోయింది. రైతుబిడ్డ గెలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇకపోతే గెలిచేస్తాడు, ట్రోఫీ కొట్టేస్తాడు, చాణక్య అని మాట్లాడుకున్న శివాజీ.. ఊహించని విధంగా మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఏదో హౌస్ట్ నాగార్జున, నిర్వహకులు పుణ్యమా అని ఏ మాత్రం ఆడకపోయినా సరే శివాజీ ఇక్కడ వరకు వచ్చాడు. లేకపోతే మనోడికి అంత సీన్ లేదు. ఇక షో అయిపోయిన తర్వాతైనా సరే తిన్నగా మాట్లాడకుండా తలతిక్క కామెంట్స్ చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్‌దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం)

బిగ్‌బాస్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ.. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అదే ఛానల్‌‌లో ఇంటర్వ్యూ ఇస్తారు. అలా గీతూ రాయల్.. శివాజీని ఇంటర్వ్వూ చేసింది. షోలో అంటే గెలవాలి కాబట్టి వంద అబద్ధాలు చెప్పొచ్చు. కానీ ఇక్కడ కూడా శివాజీ అదే బాపతు సమాధానాలు ఇస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపలేదు. టాప్-3 వరకు వస్తారని ఊహించారా? అని అడిగిదే.. 'ఈ సీజన్ విన్నర్ నేను, నాకు తెలుసు' అని తలతిక్క సమాధానం చెప్పాడు.

టాప్-3వరకు వచ్చి, మీరు ఆగిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అని అడిగితే.. తిన్నగా సమాధానం చెప్పకుండా.. పల్లవి ప్రశాంత్, ఊరి నుంచి వచ్చాడు, అతడిపై మాటలు దాడి చేశారు, అడ్డుకున్నాను.. ఇలా అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. యావర్, ప్రశాంత్ మీ వల్లే  ఇంతదూరం వచ్చారని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'అవును, కాకపోతే వాళ్ల వెనకాల ఓ శక్తి ఉందని అందరికీ తెలియజేశాను' అని శివాజీ అన్నాడు. వీళ్లిద్దరి మైండ్‌లో లేని ఆలోచనలు పుట్టించారు కదా అని అడగ్గా.. నీ ప్రశ‍్నలకు నేను సమాధానం చెప్పడానికి రాలేదని హౌస్ట్‌తోనే వాగ్వాదానికి దిగాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ ప్రశాంత్ విజయానికి అసలు కారణాలు ఇవేనా?)

అమర్‌ని కావాలనే తొలిరోజు నుంచి టార్గెట్ చేసినట్లు అనిపించింది? దీనికి ఏమంటారు అని శివాజీని అడగ్గా.. మీకు మళ్లీ మళ్లీ చెప్పేదేంటంటే అమర్ గాడు, నేను వెరీగుడ్ ఫ్రెండ్స్ అని మొత్తం ప్లేట్ మార్చేశాడు. హౌసులో అమర్‌ని పేరుతో కాకుండా ఎన్ని రకాల పదాలతో శివాజీ పిలిచాడో ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది. మీ బ్యాచ్‌లో ఫేవరిజం లేదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'మీరు ఎంత అనుకున్నా జనం చూస్తున్నారు' అని అదే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ కొట్టాడు తప్పితే తిన్నగా ఆన్సర్ చెప్పలేకపోయాడు.

శివాజీ అసలు బిగ్‌బాస్‌‌లోకి ఎందుకొచ్చాడు? అని అడగ్గా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో నా పేరు గుర్తుండాలి. దటీజ్ మై మార్క్ అని విచిత్రమైన సమాధానాలు చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ అన్నీ కూడా ప్రోమోలో చెప్పినవి. ఇక పూర్తి ఇంటర్వ్యూలో ఎన్నెన్ని విచిత్ర విన్యాసాలు చేశాడో చూడాలి?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ విన్నర్‌ ప్రశాంత్‌.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)