Breaking News

శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!

Published on Sat, 09/09/2023 - 18:31

'బిగ్‌బాస్ 7' తెలుగు సీజన్ ఇప్పుడిప్పుడే మెల్లగా పికప్ అవుతుంది. తొలివారం కాబట్టి ఒకటి రెండు టాస్కులు చిన్న చిన్న గొడవలు జరిగాయి. అలా ఆడుతూ పాడుతూ ఉండేసరికి వీకెండ్ వచ్చేసింది. దీంతో హోస్ట్ నాగార్జున విచ్చేసి సందడి చేశాడు. అదే టైంలో హౌసులో ఏమేం జరుగుతుందనేది చెప్పుకొచ్చారు. అలానే నాగార్జున.. స్మూత్‌గా వాళ్లకు కౌంటర్లు కూడా వేసేశాడు. ఇంతకీ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది?

బిగ్‌బాస్ షోలో వారంలో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే వీకెండ్ వస్తే చాలు.. హౌస్‌మేట్స్ అందరూ కలర్‌ఫుల్‌గా కనిపిస్తారు. మరోవైపు హోస్ట్ నాగార్జున కూడా ఓవైపు నవ్విస్తూనే, మరోవైపు కౌంటర్స్ వేసేస్తాడు. ఈసారి కూడా అలానే ఫుల్ ఎనర్జీతో వచ్చేసిన నాగ్.. కిరణ్ రాథోడ్ తెలుగు మాట్లాడటం లేదని చెప్పి.. ఓ పది తెలుగు పదాలు చెప్పమన్నాడు. దీంతో ఆమె ఇబ్బంది పడుతూనే చెప్పింది.

(ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్‌బాస్ 7'.. కారణం అదే?)

రాత్రిపూట షకీలా చేసిన హంగామా, సందీప్.. రతిక చెప్పులు మోసాడని, ఒకరి వెంట ఉన్నావా అని గౌతమ్ అని నాగార్జున ఫన్ జనరేట్ చేశారు. అలానే ప్రియాంకతో మాటామాటా అన్న విషయమై దామినికి క్లారిటీ ఇచ్చేశారు. అలానే హౌసులో శోభాశెట్టి ఏడుస్తుండటంపైనా నాగ్.. సైలెంట్ కౌంటర్ వేసేశాడు. 'మొదటివారం నుంచి కన్నీళ్లు పెట్టుకునే కంటెస్టెంట్‌ని ఆడియెన్స్.. టాప్-5కి పంపిన దాఖలాలు లేవు' అని నాగ్ అన్నారు. మరి నాగ్ స్టేట్‌మెంట్‪‌ని శోభాశెట్టి ఏమైనా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

ఈ సీజన్‌లోని ఎపిసోడ్స్‌ని టీవీలో ప్రతిరోజు రాత్రి టెలికాస్ట్ చేస్తుండగా, హాట్‌స్టార్‌లో 24 గంటల స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. అయితే రోజంతా లైవ్ స్ట్రీమింగ్ వల్ల.. ఎపిసోడ్ లో కిక్ ఉండటం లేదు. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా శనివారం, ఆదివారం స్ట్రీమింగ్ ఉండదని ప్రకటించారు. మళ్లీ ఆదివారం రాత్రి 10:30 తర్వాతే 24x7 స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. 

(ఇదీ చదవండి: ఎలిమినేషన్‌ ఎత్తేసిన బిగ్‌బాస్‌.. మరో కొత్త ట్విస్ట్‌!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)