Breaking News

భోలె గలీజు పురాణం.. ఆడపిల్లలని చూడకుండా ఆ కామెంట్స్!

Published on Tue, 10/17/2023 - 23:20

బిగ్‌బాస్ ఎపిసోడ్ చూస్తుంటే అయితే ఎంటర్‌టైన్‌మెంట్ లేదంటే విసుగొస్తుంది. కానీ చిరాకు మాత్రం రాదు. అయితే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ వల్ల అదే జరిగింది. హౌసులో గలీజుగా బూతులు మాట్లాడాడు. అది కూడా ఆడపిల్లల ముందు. పైగా దానికో పిచ్చి సమర్ధన. ఇదంతా కూడా మంగళవారం నామినేషన్స్ సందర్భంగా జరిగింది. ఇంతకీ తాజాగా ఏం జరిగిందనేది Day 44 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

బయటకొచ్చిన మోనిత
ఏడుగురు తమ తమ నామినేషన్స్ పూర్తి చేయడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తొలుత వచ్చిన శోభా.. భోలెని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే టాస్కులో 'ఆడపిల్ల కాబట్టి వదిలేశాను' అనే స్టేట్‌మెంట్ ఎలా పాస్ చేశారు? అని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పింది. అయితే కుండ పగలగొట్టని చెప్పాలి లేదంటే డిఫెండ్ చేయాలి కానీ.. 'నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుందిరా' అని కామెడీ చేశాడు. నువ్వు మోనిత కావొద్దని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పదేపదే మోనిత అనే పేరు ప్రస్తావిస్తూ.. వింత వింత సామెతలన్నీ చెబుతూ పిచ్చెక్కించాడు. 

(ఇదీ చదవండి: విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!)

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?

  • శోభాశెట్టి - తేజ, భోలె
  • శివాజీ - గౌతమ్, అమరదీప్
  • అశ్విని - పూజామూర్తి, అర్జున్
  • గౌతమ్ - భోలె, శివాజీ
  • భోలె - శోభాశెట్టి, ప్రియాంక
  • యవర్ - గౌతమ్, అమరదీప్

భోలె బూతు పురాణం
అయితే శోభాశెట్టి నామినేట్ చేస్తున్న టైంలో భోలె ఓ బూతు పదాన్ని వాడాడు. దీంతో పక్కనే ఉన్న ప్రియాంక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అని ప్రియాంక అనగానే.. 'ఆగమ్మ కాసేపు ఆగు' అని మరింత ఇరిటేషన్ తెప్పించాడు. మధ్యలో 'మా రైతుబిడ్డ' అని చెప్పి ప్రశాంత్ ఫ్యాన్స్‌ సింపతీ కొట్టేద్దామని చూశాడు. మధ్యలో ఎంటరైన శోభా.. ప్రేమ చూపించి, ప్రశాంత్ ఫ్యాన్స్ ఓట్లు కొట్టేద్దామనుకుంటున్నారా? అని భోలె ఆలోచన బయటపెట్టి, కడిగిపారేసింది. దీంతో వచ్చే వారమే వెళ్లిపోతా, రాస్కో అని భోలె బరస్ట్ అయిపోయాడు. అంత సీరియస్‌గా గొడవ జరుగుతుంటే..  'ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్తు ఉంది' అని ఏదేదో మాట్లాడాడు. ఇక కాసేపటి తర్వాత స్పందించిన బిగ్‌బాస్.. బూతులు మాట్లాడటం ఆపేయకపోతే సహించేది లేదని అన్నాడు.

(ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?)

మళ్లీ శోభా vs భోలె
ఇక భోలె తన నామినేషన్స్‌లో భాగంగా శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు. కానీ సరైన కారణాలు చెప్పలేకపోయాడు. అలా అని వాళ్లతో వాదించనూ లేకపోయాడు. మధ్యలో 'నీకు ఎర్రగడ్డే దిక్కు' అని శోభాతో అన్నాడు. దీంతో ఆమె మళ్లీ రెచ్చిపోయింది. అయితే బూతులు మాట్లాడటం తనకు ఊతపదం అని ఏదో చెప్పుకొచ్చాడు కానీ అది ఏ మాత్రం కరెక్ట్‌గా అనిపించలే.

ఈ వారం నామినేట్ అయింది వీళ్లే

  • భోలె
  • అశ్విని
  • తేజ
  • ప్రశాంత్
  • పూజా
  • అమరదీప్
  • గౌతమ్

అయితే భోలెని సరిగ్గా పరిశీలిస్తే ఓ విషయం క్లియర్‪‌గా అర్థమైంది. రైతుబిడ్డ అనే పేరుని పోలినట్లు పాటబిడ్డ అని ట్యాగ్ పెట్టుకుని సింపతీ కొట్టేద్దామనుకున్నాడు. అలానే శివాజీలా మంచి మాటలు చెబుతూ.. హౌసులో ఉండిపోదామనుకున్నాడు. కానీ వచ్చిన రెండోవారానికే భోలె నిజస్వరూపాన్ని ప్రియాంక, శోభాశెట్టి బయటపెట్టేశారు. దీనికి తోడు బూతులు మాట్లాడటంతో భోలె తన పరువు తానే తీసుకున్నట్లు అయింది. మరి ఇలాంటి ఇరిటేటింగ్ క్యారెక్టర్‌ ఉంటాడా? ఎలిమినేట్ అయిపోతాడా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)