Breaking News

Bigg Boss 7: అశ్విని ఎలిమినేట్.. ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంత తెలుసా?

Published on Sat, 11/25/2023 - 23:36

బిగ్‌బాస్ 7లో అనుకున్నట్లే ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా హౌస్ నుంచి అశ్విని బయటకొచ్చేసింది. గతవారం హోస్ట్ నాగార్జున చెప్పినట్లే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఈమెది తొలి వికెట్. అయితే ఈమె ఎలిమినేట్ అవడానికి హింట్స్ ముందే వచ్చాయి. ఇన్నాళ్లు హౌస్‌లో ఉన్నందుకుగానూ ఎన్ని లక్షలు సంపాదించింది?

(ఇదీ చదవండి: Bigg Boss 7: బయటకొచ్చేస్తానని శివాజీ డ్రామా? అమర్ నిజస్వరూపం బట్టబయలు!)

వైల్డ్ కార్డ్ ఎంట్రీ
'సరిలేరు నీకెవ్వరు', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'రాజా ది గ్రేట్' తదితర సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసిన అశ్వినికి గుర్తింపు ఏం రాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఒంపుసొంపులకు బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 8న బిగ్‌బాస్‌లోకి ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో అశ్విని ఒకరు.

భోలెతో దోస్తీ
ఇక బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత అశ్విని మిగతా వాళ్లతో పెద్దగా కలవలేకపోయింది. తనతో ఎవరు మింగిల్ అవ్వట్లేదని సీరియల్ బ్యాచ్‌తో నామినేషన్స్ సందర్భంగా ఈమె గొడవ కూడా పెట్టుకుంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే తనతో పాటు వచ్చిన సింగర్ భోలెతో ఈమెకి దోస్తీ కుదిరింది. గేమ్స్ పరంగా అంతంత మాత్రంగానే ఉన్న అశ్విని.. ఒక్కో వారం సేవ్ అవుతూ ఇప్పటివరకు ఉండిపోయింది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)

ఎలిమినేషన్ కారణం?
అయితే ప్రతివారం కాస్తోకూస్తో తన టంగ్ పవర్ చూపిస్తూ వచ్చిన అశ్విని.. ఈ వారం మాత్రం సైలెంట్ అయిపోయింది. నామినేట్ చేయడానికి పేర్లు లేవని చెప్పి సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. దీంతో అప్పుడే చాలామంది ఈమె ఈవారం ఎలిమినేట్ అయిపోవడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్లు ఈమె బయటకొచ్చేసింది.

రెమ్యునరేషన్ ఎంత?
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని.. బిగ్‌బాస్‌లో మొత్తంగా ఏడు వారాలు ఉంది. వారానికి రూ.2 లక్షలు చొప్పున దాదాపు రూ.14 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ప్రసుతానికైతే ఈమె ఎక్కువ మొత్తం అందుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఇంకా అర్జున్ మాత్రమే మిగిలున్నాడు.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?)

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)