Breaking News

ఫైర్‌ మీదున్న అమర్‌.. రెండో వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

Published on Mon, 09/11/2023 - 13:13

సండే ఫండే అంటాడు నాగార్జున.. కానీ ప్రేక్షకులకు మాత్రం అసలైన ఫండే మండేనే అంటుంటారు. ఎందుకంటే అప్పుడే కదా అసలైన కార్చిచ్చు రగిలేది! నామినేషన్స్‌ ప్రక్రియతో హౌస్‌లో మంట రగిల్చేందుకు రెడీ అయ్యాడు బిగ్‌బాస్‌. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. కంటెస్టెంట్లు తాము నామినేట్‌ చేయాలనుకున్నవారిని పిట్‌లో నిలబెట్టి అందుకు గల కారణాలు చెప్పి బజర్‌ నొక్కాల్సి ఉంటుంది. బజర్‌ నొక్కినప్పుడు పిట్‌లో పైన ఉన్న బకెట్‌లోని రంగు వారిపై పడుతుంది. నామినేషన్స్‌ డే కావడంతో హౌస్‌మేట్స్‌ ఫన్‌ వదిలి ఫైర్‌ మీదున్నారు.

ఆట సందీప్‌ తనను టార్గెట్‌ చేస్తున్నాడని ఫీలయ్యాడు ప్రిన్స్‌ యావర్‌. శివాజీ ఎవరినీ మాట్లాడనివ్వట్లేదంటూ అతడిపై గరమైంది ప్రియాంక జైన్‌. బిగ్‌బాస్‌ మాట తప్ప ఎవరి మాటా వినను అని శివాజీ బదులివ్వగా.. నాతో అలా మాట్లాడకు అని హెచ్చరించింది ప్రియాంక. అటు అమర్‌దీప్‌.. మరోసారి పల్లవి ప్రశాంత్‌ను మధ్యలోకి లాక్కొచ్చాడు. ప్రశాంత్‌ వేటాడటానికి వచ్చాడంటే నేనేమైనా పేకాడేందుకు వచ్చానా? అని శివాజీ సెటైర్ల మీద విరుచుకుపడ్డాడు.

ఇకపోతే పవర్‌ అస్త్ర గెలుచుకున్న ఆట సందీప్‌ ఇంటిసభ్యుల్లో ఒకరిని నేరుగా నామినేషన్స్‌కు పంపించవచ్చని ఆఫర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మరి అతడు ఎవరిని నామినేట్‌ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ వారం శివాజీ, శోభ, తేజ, రతిక, ప్రిన్స్‌ యావర్‌, షకీలా.. నామినేషన్స్‌లో ఉన్నారంటూ ప్రచారం నడుస్తోంది. మరి వీరిలో ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారనే విషయంపై క్లారిటీ రావాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

చదవండి: డ్రగ్స్‌కు బానిసయ్యా, మా నాన్నను నోటికొచ్చింది తిట్టా.. ఇంట్లో నుంచి గెంటేశాడు: జైలర్‌ హీరో

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)