Breaking News

ఎలిమినేషన్‌ను ముందే ఊహించిన ఇనయ? నాగార్జున హింట్‌

Published on Sat, 12/10/2022 - 23:46

Bigg Boss 6 Telugu, Episode 98: ఫినాలే దగ్గరపడుతుండటంతో నాగార్జున ఫన్నీ టాస్కులు మానేసి సీరియస్‌ టాస్కులు ఆడించాడు. మొదటగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓట్ల క్యాంపెయినింగ్‌ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శ్రీహాన్‌ మాట్లాడుతూ.. రేవంత్‌ తప్పులను అంగీకరించడు. అతడికి కోపం ఎక్కువ. కానీ నేను తప్పులను ఒప్పుకోవడమే కాకుండా వాటిని సరిదిద్దుకుంటాను. తనకంటే బాగా ఎంటర్‌టైన్‌ చేస్తాను. అందుకోసం నాకు ఓటేసి గెలిపించాలి అని చెప్పాడు.

ఇక రేవంత్‌ మాట్లాడుతూ.. నేను ఏ టాస్కునూ వదల్లేదు. విన్నర్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు నాకున్నాయి. శ్రీహానే కాదు, ఇక్కడ ఎవరినీ నాకు కాంపిటీటర్‌గా అనుకోలేదు అని చెప్పాడు. దీంతో శ్రీహాన్‌ మధ్యలో కలగజేసుకుంటూ ఒకటి చెప్పాలి సర్‌ అని అడిగాడు. దీనికి నాగ్‌.. రేవంత్‌ ఫ్లిప్పర్‌ అని చెప్పాలనుకున్నావు, అంతేనా? అన్నాడు. దీంతో అందుకున్న రేవంత్‌.. శ్రీహాన్‌ వెనకాల మాట్లాడతాడని తెలుసు, ఇంతకుముందు కూడా విన్నాను, కానీ ఎప్పుడూ తనను అడగలేదని చెప్పాడు. అతడి మాట విని షాకైన శ్రీహాన్‌.. నీకు చెప్పిన విషయాలే మాట్లాడానే తప్ప వెనకాల కొత్తగా ఏమీ మాట్లాడలేదు అని బదులిచ్చాడు.

తర్వాత మిగతా ఐదుగురు కూడా తమలో ఉన్న పాజిటివ్‌ అంశాలను చెప్తూ దానికోసం ఓట్లేయాలన్నారు. అనంతరం హౌస్‌మేట్స్‌ దెయ్యం టాస్కులో ఎంత భయపడ్డారో వారికే వీడియో వేసి చూపించాడు నాగ్‌. చీకటి గదిలో తాము చేసిన విన్యాసాలు చూసి కంటెస్టెంట్లు పడీపడీ నవ్వుకున్నారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో మరో గేమ్‌ ఆడించాడు నాగ్‌. బెస్ట్‌ అనుకున్న ముగ్గురికి స్టార్‌ రేటింగ్స్‌ ఇచ్చి, వేస్ట్‌ అనుకున్న ముగ్గురికి క్రాస్‌ సింబల్‌ ఫేస్‌పైన ముద్రించాలన్నాడు.

అలా ఈ గేమ్‌లో ఎవరెవరు ఎవరికి స్టార్స్‌, ఎవరికి క్రాస్‌ గుర్తులు ఇచ్చుకుంటూ వెళ్లారంటే..

కంటెస్టెంట్‌ 3 స్టార్స్‌ 2 స్టార్స్‌ 1 స్టార్‌ సింగిల్‌ క్రాస్‌ డబల్‌ క్రాస్‌
(బ్యాడ్‌)
ట్రిపుల్‌ క్రాస్‌
(వెరీ బ్యాడ్‌)
ఆదిరెడ్డి. శ్రీహాన్‌ రేవంత్‌ రోహిత్‌ శ్రీసత్య ఇనయ కీర్తి
కీర్తి రోహిత్‌ ఇనయ రేవంత్‌ శ్రీహాన్‌ కీర్తి ఆదిరెడ్డి
శ్రీసత్య శ్రీహాన్‌ రేవంత్‌ ఆదిరెడ్డి రోహిత్‌ ఇనయ కీర్తి
ఇనయ కీర్తి శ్రీసత్య రేవంత్‌ శ్రీహాన్‌ రోహిత్‌ ఆదిరెడ్డి
రేవంత్‌ శ్రీసత్య శ్రీహాన్‌ కీర్తి ఆదిరెడ్డి రోహిత్‌ ఇనయ
శ్రీహాన్‌ రేవంత్‌ ఆదిరెడ్డి శ్రీసత్య ఇనయ కీర్తి రోహిత్‌
రోహిత్‌ ఆదిరెడ్డి రేవంత్‌ కీర్తి శ్రీహాన్‌ శ్రీసత్య ఇనయ

తర్వాత కీర్తి, రేవంత్‌ సేవ్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌. దీంతో టికెట్‌ టు ఫినాలే సాధించిన శ్రీహాన్‌తో పాటు రేవంత్‌, కీర్తి ఫైనల్‌ వీక్‌కు వెళ్లారని ప్రకటించాడు నాగ్‌. మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో హౌస్‌మేట్స్‌ గెస్‌ చేయాలన్నాడు. ముందుగా శ్రీహాన్‌.. రోహిత్‌ వెళ్లిపోతాడని అభిప్రాయపడగా కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్‌ అయిపోతాడేమోనని చెప్పుకొచ్చింది. రేవంత్‌ వంతు రాగా.. ఎన్నడూ ఎవిక్షన్‌కు భయపడని ఇనయ మొట్టమొదటిసారి నిన్న భయపడింది. దాన్నిబట్టి ఆమె ఎలిమినేట్‌ కావచ్చేమోననుకున్నాడు. దీంతో ఇనయ అందుకుంటూ.. నిన్ననే కదా నేను టాప్‌ 5 కంటెస్టెంట్‌ అన్నావు, అంతలోనే మాట మార్చి ఈ వారం వెళ్లిపోతానని చెప్తున్నావేంటి అంటూ నిలదీసింది. రేవంత్‌ ఇప్పుడు తన మనసులో ఉన్నది మాట్లాడాడంటూ జరగబోయేది ఇదేనని చెప్పకనే చెప్పాడు నాగ్‌.

ఇకపోతే మొన్నటిదాకా ప్రైజ్‌మనీని బిగ్‌బాస్‌ పెంచగా ఈసారి నాగార్జున ఇంటిసభ్యులకు మర ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. తన ముందున్న మూడు సూట్‌కేసుల్లో డబ్బులున్నాయని, ఎక్కువ అమౌంట్‌ ఉన్న కరెక్ట్‌ సూట్‌కేస్‌ సెలక్ట్‌ చేసుకోమన్నాడు. హౌస్‌మేట్స్‌ అత్యధికంగా రూ.3 లక్షలున్న సూట్‌కేసు సెలక్ట్‌ చేసుకున్నారు. దీంతో ఈ మూడు లక్షలు కలపగా ఫైనల్‌ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలకు చేరింది. ఈ అరకోటి రూపాయలతో పాటు విన్నర్‌ రూ.25 లక్షల విలువైన 605 గజాల స్థలాన్ని గెలుచుకోనున్న విషయం తెలిసిందే! దీనికి తోడు మారుతి సుజుకి బ్రెజ్జా కారు సైతం సొంతం చేసుకోనున్నట్లు ప్రకటించడంతో హౌస్‌మేట్స్‌ ఎగిరి గంతేశారు.

చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా?
టాప్‌ 3లో ఉంటుందనుకున్న ఇనయ ఎలిమినేట్‌?

Videos

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)