Breaking News

Bigg Boss 6: నడవలేని స్థితిలో శ్రీసత్య తల్లి.. వీల్‌చైర్‌పై బిగ్‌బాస్‌ హౌస్‌లోకి..

Published on Wed, 11/23/2022 - 14:08

బిగ్‌బాస్‌ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి భార్య, కూతురితో పాటు రాజ్‌ వాళ్ల తల్లి హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. వారి రాకతో ఆదిరెడ్డి, రాజ్‌లలో నూతనోత్తేజం వచ్చింది. ఇక మిగతా కంటెస్టెంట్స్‌ కూడా తమ కుటుంబ సభ్యులు వస్తారని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఫైమా, శ్రీసత్యల పేరెంట్స్‌ వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా అర్థమవుతుంది.

అమ్మను చూసిన ఫైమా ఆనందంతో ఎగిరిగంతేసింది. తల్లిని గట్టిగా హగ్‌ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూర్చొబెట్టుకొని కబుర్లు చెప్పింది. ‘నువ్వు ఇంగ్లీష్‌ అందరికి నేర్పిస్తున్నావు.. నాకు కూడా నేర్పించవా’ అంటూ కూతురిపై సెటైర్‌ వేసింది. ‘ఫైమా కాకుండా మీకు నచ్చిన ప్లేయర్‌ ఎవరో చెప్పండి అని శ్రీసత్య అడగ్గా.. ‘అందరూ ఇష్టమే’అంటూ తెలివిగా తప్పించుకుంది. రేవంత్‌ని చూస్తూ.. ‘నిన్ను చూస్తే భయమేస్తుంది’ అని అనడంతో అంతా గట్టిగా నవ్వారు. ఇక శ్రీసత్య తన తల్లిని తలుచుకొని బాధపడంది. ‘మా మమ్మీ కూడా నడుస్తూ ఉంటే బాగుండేది’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

అదే సమయంలో గార్డెన్‌ ఏరియా నుంచి ‘సోనూ’ అని పిలుస్తూ శ్రీసత్య పేరెంట్స్‌ వచ్చారు. అయితే శ్రీసత్య తల్లి అనారోగ్యంతో కొంతకాలంగా నడవలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమెను వీల్‌చైర్‌లో తీసుకొని వచ్చాడు శ్రీసత్య తండ్రి. ఇక అమ్మానాన్నాలను చూసిన ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఇద్దరిని గట్టిగా హగ్‌ చేసుకొని ఏడ్చేసింది. తల్లికి అన్నం తిపిపించింది. ఇక రాజ్‌ గురించి చెబుతూ.. ‘ఫస్ట్‌ వీక్‌లో నామినేట్‌ ఏమని చేశాడో తెలుసా డాడీ.. ‘నువ్వు మాట్లాడుతున్నావు కానీ కనెక్షన్‌ కుదర్టేదు’అన్నాడు అని శ్రీసత్య చెప్పగా..‘నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్‌ వేస్తున్నావులే’అని డాడీ అనడంతో ఆమె మొహం మార్చుకుంది. రేవంత్‌ అయితే ఆయనకు షేక్‌హ్యాండ్‌ ఇస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా శ్రీసత్య, ఫైమా పేరెంట్స్‌ ఏం ఏం చెప్పారు. వాళ్లు చేసిన సందడి ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Videos

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

వంశీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు: పంకజశ్రీ

పేరుకు సీఎం.. చేసేది రౌడీయిజం

అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

Photos

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)