Breaking News

Bigg Boss 6: పంపించకపోతే చస్తా అని బెదిరించింది.. ఫైమా తల్లి 

Published on Tue, 11/01/2022 - 20:03

బిగ్‌బాస్‌-6లో తనదైన ఆట తీరుతో దూసుకెళ్తోంది ఫైమా. టాస్క్‌ల విషయంలో ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఆడుతుంది. కొన్ని కొన్ని సార్లు వెతకారం మాటలతో ఇబ్బంది పెడుతున్నా.. ఆమె చేసే కామెడీ అందరికి నచ్చుతుంది. అందుకే తొమ్మిది వారాలుగా హౌస్‌లో కొనసాగుతుంది. అయితే ఫైమాకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడం వెనుక చాలా కష్టం ఉంది. ఆమె ఇండస్ట్రీలోకి రావడమే యాదృచ్ఛికంగా జరిగిందట. ‘పటాస్‌’ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది ఫైమా. అయితే  ఆ ఆఫర్‌ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. చస్తా అని బెదిరించి మరీ ఇండస్ట్రీలోకి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తల్లే చెప్పింది. 


తల్లితో ఫైమా(పాత ఫోటో)

తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైమా తల్లి మాట్లాడుతూ.. ‘నాకు నలుగురు ఆడ పిల్లలు. ఫైమా చిన్నది. ఊర్లో కూలి పని చేసుకుంటూ బతికే వాళ్లం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. పురుగులు పడిన బియ్యం, నూకలు పెట్టి నా బిడ్డలను పెంచుకున్నా. ఫైమా చిన్నప్పటి నుంచి చాలా మొండిది. ఏదైనా అనుకుంటే సాధించేవరకు వదిలిపెట్టదు.  కాలేజీ చదుతున్న రోజుల్లో ఫ్రెండ్స్‌ ట్రిప్‌ వేస్తే ‘పటాస్‌’షోకి వెళ్లింది.

అక్కడ స్టేజ్‌ మీదకు వెళ్లేందుకు గట్టి గట్టిగా అరిచిందట. దాంతో ఆమె వాయిస్, మాట్లాడిన విధానం నచ్చి ‘పటాస్‌’ షోకి ఆహ్వానించారు. ఈ విషయం మాతో చెబితే.. వద్దని చెప్పాం. ఆడపిల్ల హైదరాబాద్‌లో ఎలా ఉంటుందని భయపడ్డాం. కానీ ఫైమా మాత్రం వెళ్తానని పట్టుపట్టింది. గదిలోకి వెళ్లి .. ‘పటాస్‌’షోకి పంపకపోతే చస్తా’అని బెదిరించింది. దీంతో ఆమెను బలవంతంగా పంపించాం. ఆ షో ద్వారా మంచి పేరు వచ్చింది. తర్వాత జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో మరింత గుర్తింపు వచ్చింది. నేను ఎక్కడి వెళ్లినా ఫైమా తల్లి అని గుర్తుపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. నా కూతురు బిగ్‌బాస్‌ టైటిల్‌ కూడా గెలుస్తుందనే నమ్మకం ఉంది’అన్నారు. 

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)