Breaking News

కాజల్‌పై భగ్గుమన్న శ్రీరామ్‌, దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన సన్నీ

Published on Mon, 11/22/2021 - 17:20

Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్‌ కథ కంచికి చేరుకుంటోంది. 19 మందితో మొదలైన బిగ్‌బాస్‌ ప్రయాణంలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరంతా ఎవరికి వారు టాప్‌ 5కి చేరుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే తమలో నుంచి ఒకరిని పంపించే నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈమేరకు తాజా ప్రోమో రిలీజైంది.

ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌లో సన్నీని గెలిపించడం కోసం సిరి, యానీ ఇద్దరి ఫొటోలు కాల్చేసిన కాజల్‌పై భగ్గుమని లేచాడు శ్రీరామ్‌. అందరూ ఒకరిని సేవ్‌ చేయాలన్న ఉద్దేశంతో ఆడితే నువ్వు మాత్రం ఇద్దరిని గేమ్‌ నుంచి సైడ్‌ చేయాలని ఆడావు. అది నాకు నచ్చలేదని చెప్తూ కాజల్‌ను నామినేట్‌ చేశాడు. దీనికి కాజల్‌ స్పందిస్తూ.. నా ఫ్రెండ్‌ను సేవ్‌ చేసి అతడికి పాస్‌ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని శ్రీరామ్‌.. నీ ఫ్రెండ్‌ వెళ్లిపోతాడని భయమా? అని ప్రశ్నించాడు.

తర్వాత సన్నీతోనూ పోట్లాటకు దిగాడు. సిరి, షణ్ను, రవి, నేను ఒక గ్రూప్‌ అని ఒప్పుకున్నాడు. అంతెందుకు, నేను, ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక గ్రూప్‌.. ఇప్పుడు చెప్పు అని శ్రీరామ్‌ డైలాగ్‌ విసరగా.. 'ఆ గ్రూపుకు నేను లీడర్‌ను' అంటూ దిమ్మ తిరిగే పంచ్‌ ఇచ్చాడు సన్నీ. ఇదిలా వుంటే కెప్టెన్‌ మానస్‌ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం!

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)