Breaking News

వినాయకుడు ఫైర్‌.. దద్దరిల్లిన బిగ్‌బాస్‌ హౌస్‌

Published on Tue, 09/08/2026 - 15:04

బిగ్‌బాస్‌ సీజన్‌ 10లో హౌస్‌మేట్‌గా మారేందుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద రచ్చ మొదలైంది. రెడ్‌, బ్లూ టీమ్‌ సభ్యుల ఫొటోలను పెట్టి.. హౌస్‌మేట్‌గా మారేందుకు అర్హత లేని ఐదుగురి ఫొటోలపై కారణాలు చెబుతూ స్టార్‌ చేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
రాంప్రసాద్‌, వర్షిణి ఎం చెప్పారంటే..
బ్లూ టీమ్‌ నుంచి వర్షిణి, రాంప్రసాద్‌ కలిసి రోహిత్‌, చరణ్‌ ఫొటోలపై స్టార్‌ చేశారు. అగ్నిపరీక్షలో రోహిత్‌ను పదేపదే లేపి పైకి కూర్చోబెట్టారని.. అంతేతప్ప అతనికి అంత సీన్‌ లేదని వర్షిణి చెప్పింది. అగ్నిపరీక్షలో రోహిత్‌ 100 శాతం ఇచ్చాడని అనుకుంటే.. హౌస్‌లో మాత్రం 10 శాతం కూడా చరణ్‌ లేడని రాంప్రసాద్‌ వ్యాఖ్యానించాడు.
మరోవైపు దేబ్జానీ.. షాలినీ ఫొటోపై స్టార్‌ చేసింది. షాలినీకే అంతా తెలుసన్నట్లు వ్యవహరించడం తనకు నచ్చలేదని చెప్పింది. అలాగే సృష్టి, అమన్‌ కూడా హౌస్‌మేట్‌గా ఉండేందుకు అర్హులు కాదంటూ బ్లూ టీమ్‌ సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

రెడ్‌ టీమ్‌వాళ్ల వాదనలు ఇవీ..
ఇదే టాస్క్‌ను రెడ్‌ టీమ్‌కు కూడా బిగ్‌బాస్‌ ఇచ్చాడు. అయితే ఈసారి కూడా అందరి ముందే కారణాలు చెప్పాలని ఆదేశించాడు. దీంతో రోహిత్‌ రంగంలోకి దిగాడు. రాంప్రసాద్‌, వర్షిణి, వినాయకుడు (కృష్ణుడు), దేబ్జానీ, త్రిగుణ్‌ ఫొటోలపై స్టార్‌ చేశాడు. వీళ్లు కూడా హౌస్‌మేట్‌గా పనికిరారని చెబుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు టాస్క్‌లో రూల్స్‌ అన్నీ బ్రేక్‌ చేశారని, ఎదుటివాళ్లు చెప్పేది వినే ఓపిక కూడా లేదని రోహిత్‌ ఆరోపించాడు. ఊరికే ఓవర్‌ డామినేషన్‌ చేస్తారని, పనికిరాని వాదనలు చేస్తారని విమర్శించాడు. రోహిత్‌ మాటలకు వర్షిణి వెకిలిగా నవ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

రోహిత్‌కి గట్టి కౌంటర్‌..
అక్కడితో ఆగని వినాయకుడు (కృష్ణుడు).. రోహిత్‌కు గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. తాను 100 శాతం ఇవ్వలేదని ఎలా అంటావంటూ ప్రశ్నించాడు. ‘యూ ఆర్‌ నాట్‌ కేపబుల్‌ ఆఫ్‌ బికమింగ్‌ ఏ లీడర్‌.. నువ్వు ఎలా ఉండాలో మాకు చెబుతున్నావు. నువ్వు రాజు.. మేము నీ సైనికులమా?’ అంటూ రోహిత్‌పై తీవ్రంగా మండిపడ్డాడు.

ఇప్పటికే టాస్క్‌ విషయంలో రెండు టీమ్‌ల మధ్య పోటీ తారస్థాయికి చేరగా.. రోహిత్‌, వినాయకుడి మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తిని పెంచింది. ప్రోమో చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లో పెద్ద వార్‌ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుంది? ఎవరు వెనక్కి తగ్గుతారు? హౌస్‌మేట్‌గా మారే అవకాశం ఎవరికి దక్కుతుంది? తెలియాలంటే ఈరోజు రాత్రి 9.30 గంటల వరకు వేచి చూడాల్సిందే!
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)