Breaking News

‘మంచు’ ఫ్యామిలీ వార్‌.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి

Published on Tue, 12/10/2024 - 16:12

మంచు ఫ్యామిలీ వివాదంపై కీలక విషయాలు బయటకు వచ్చాయి. మంచు మనోజ్‌, తండ్రి మోహన్‌ బాబు గొడపడ్డారని వారింటి పని మనిషి తెలిపారు. ఇద్దరు ఒకరినొకరు నెట్టుకున్నారని, ఆ సమయంలో మనోజ్‌ భార్య మౌనికతో పాటు అతని తల్లి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. తండ్రికొడుకుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లకు అది బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. 

(చదవండి: మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత)

‘మోహన్‌ బాబు ఫ్యామిలీలో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మనోజ్‌ వ్యవహార శైలీ మోహన్‌ బాబుకు అస్సలు నచ్చదు. మౌనికను పెళ్లి చేసుకోవడం కూడా ఆ కుటుంబంలో ఎవరికి నచ్చలేదు. అప్పటి నుంచే ఈ గొడవలు మరింత ఎక్కువైయ్యాయి. ఆదివారం గొడవ జరిగిన సమయంలో మనోజ్ భార్య, తల్లి అక్కడే ఉన్నారు. మోహన్‌ బాబు, మనోజ్‌ ఒకరినొకరు నెట్టుకున్నారు. మంచు లక్ష్మి వచ్చి మనోజ్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మోహన్‌ బాబు అంటే విష్ణుకు చాలా ఇష్టం. ఆయనను ఏమైనా అంటే ఊరుకోరు’ అని పని మనిషి చెప్పారు. 

కొనసాగుతున్న సస్పెన్స్‌
మంచు కుటుంబ వివాదంలో ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. తనపై దాడి చేశారని మంచు మనోజ్‌.. కొడుకుతో ప్రాణ హానీ ఉందని మోహన్‌ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. మంచు లక్ష్మి రంగంలోకి దిగి తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక నేడు మంచు విష్ణు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మోహన్‌ బాబు ఇంటి దగ్గర ఉన్న మనోజ్‌ బౌన్సర్లను బయటకు పంపించేశాడు. ఇది మా ఇంటి గొడవ అని, మేమే పరిష్కరించుకుంటామని విష్ణు, మోహన్‌ బాబు చెప్పినా.. ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. మరికాసేపట్లో మంచు మనోజ్‌ డీసీపీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు మోహన్‌ బాబుపై ఇటు మనోజ్‌పై కేసులు నమోదయ్యాయి. ఆస్తి కోసం మోహన్‌ బాబు, ఆస్థిత్వం కోసం మనోజ్‌ చేసిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)