Breaking News

నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని

Published on Wed, 05/17/2023 - 08:25

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించి, సంగీతం, ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహించి దర్శకుడిగా తొలిసారిగా మెగా ఫోన్‌ పట్టిన చిత్రం పిచ్చైక్కారన్‌–2. విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదిన విడుదలకు సిద్ధమవుతోంది.

(ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!)

విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో సరైన వ్యక్తులను పెట్టాం. ఎడిటింగ్‌, మ్యూజిక్‌, డైరెక్షన్‌.. ఇలా టెక్నికల్‌ వర్క్‌లో బిజీగా ఉండడం వల్ల తెలుగు నేర్చులేకపోయా. భవిష్యత్తులో తప్పకుండా తెలుగులో మాట్లాడతా. హీరోయిన్‌ కావ్య థాపర్ ప్రమాదం నుంచి నన్ను రక్షించింది. నేను చేసిన పొరపాటు వల్లే చిత్రీకరణలో ప్రమాదం జరిగింది. బిచ్చగాడు చూసిన మిమ్మల్ని ఈ సినిమా నిరాశపరచదు.' అని విజయ్‌ అన్నారు. అడివి శేష్‌ నటించిన గూఢచారి’ సినిమాని చూశానని.. అలాంటి సినిమాలో నటించడమేకాకుండా కథను స్వయంగా రాయడం కష్టమన్నారు. ఆకాశ్‌ పూరీ నటించిన సినిమా బాగా ఆకట్టుకుందన్నారు.

ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం ఫ్రీ రిలీజ్‌ కార్యక్రమానికి స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు. ముందుగా నిర్మాత ఫాతిమా విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ పొంగల్‌ రోజున విజయ్‌ ఆంటోని సహాయకుడు ఫోన్‌ చేసి సార్‌ నీళ్లలో మునిగి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని చెప్పారన్నారు. అప్పుడు తనకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైందన్నారు. తాను విజయ్‌ ఆంటోనికి అర్థాంగిగానూ, ఆయన చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

(ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉండేలా ప్లాన్!)

 దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ విజయ్‌ ఆంటోని మంచి సంగీత దర్శకుడిగా రాణిస్తూ మళ్లీ కథానాయకుడిగా నటించాడు ఎందుకు అని అనుకున్నానని, అయితే పిచ్చైక్కారన్‌ చిత్రం చూసిన తరువాత తన ఆలోచన మారిందన్నారు. ఇప్పుడు ఈ పిచ్చైక్కారన్‌–2 చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే అన్ని విషయాలు చక్కగా చేశారనిపిస్తోందన్నారు. విజయ్‌ ఆంటోని పునర్‌ జన్మ ఎత్తింది ఆయన సతీమణి ఫాతిమా కోసం, అభిమానుల కోసం అని ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. 


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)