Breaking News

కథ నచ్చితే అందుకు రెడీ అంటున్న బ్యూటీ

Published on Tue, 02/27/2024 - 01:01

‘‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ చిత్రంలో లక్ష్మి అనే రిపోర్టర్‌ పాత్ర చేశాను. చాలా సహజంగా ఉండే బలమైన పాత్ర నాది. ఈ మూవీలో సస్పెన్స్, రొమాన్స్, పాటలు.. ఇలా అన్నీ ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్‌ ఆద్యంతం ఉంటుంది. క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరు. ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ వంటి మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది’’ అని హీరోయిన్‌ రాశీ సింగ్‌ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.

ఈ సందర్భంగా రాశీ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘మాది రాయ్‌పూర్‌. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. ఏడాది పాటు ఎయిర్‌ హోస్టెస్‌గా చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. హీరోయిన్‌ కావాలని చాలా కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. మేం మొదట్లో ముంబైలో ఉండేవాళ్లం.. ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేశాం. తెలుగు పరిశ్రమ, హైదరాబాద్‌ చాలా నచ్చాయి. ఇక ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ విషయానికొస్తే.. ఆడిషన్‌లో నన్ను ఎంపిక చేశారు పురుషోత్తం రాజ్‌. కథ నచ్చితే గ్లామర్‌ రోల్స్‌ చేయడానికి సిద్ధమే. ‘ఆర్య 2’ మూవీ చూసి అల్లు అర్జున్‌గారికి ఫ్యాన్‌ అయిపోయాను. సుహాస్‌కి జోడీగా నేను నటించిన ‘ప్రసన్న వదనం’ సినిమా త్వరలో విడుదల కానుంది’’ అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)