Breaking News

14 ఏళ్ల వయసు.. ఆరోజు జరిగింది ఇప్పటికీ మర్చిపోలేను: హీరోయిన్‌

Published on Sun, 02/04/2024 - 11:31

అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నారు గాంధీజీ. కానీ ఎక్కడ? పట్టపగలు కూడా దారుణాలు జరుగుతున్నాయి. ఆడవారిపై వేధింపులు, అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సాధారణ మహిళలే కాదు, సెలబ్రిటీలు సైతం ఎప్పుడో ఒకసారి వేధింపులకు గురవుతున్నారు. ఆ జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది బాలీవుడ్‌ హీరోయిన్‌ భూమి ఫడ్నేకర్‌.

నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ..
ఆమె మాట్లాడుతూ... 'ముంబైలోని బాంద్రాలో జరిగిన సంఘటన నన్నింకా వెంటాడుతోంది. అప్పుడు టీనేజ్‌.. దాదాపు 14 ఏళ్లు ఉంటాయనుకుంటా.. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాను. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో అసభ్యంగా తాకుతున్నారు. అక్కడ చాలామంది జనం ఉండటంతో ఎవరలా చేస్తున్నారో అర్థం కాలేదు. నన్ను గిల్లుతున్నారు, పదేపదే అభ్యంతరకరంగా తాకడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు పిచ్చి పట్టినట్లయింది. అప్పుడు దీని గురించి కనీసం పేరెంట్స్‌కు కూడా చెప్పలేదు.

అప్పుడు బిగుసుకుపోతాం
ఎందుకంటే అప్పటికే నేను అయోమయంలో ఉండిపోయాను. కానీ ఇప్పటికీ ఆరోజును మర్చిపోలేను. నా శరీరం, మెదడు ఆ సంఘటనను పదేపదే గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ ఘటన జరిగినప్పుడు మన బుర్ర పని చేయదు, భయంతో, అసౌకర్యంతో బిగుసుకుపోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ దమ్‌ లగాగే హైషా(2015) చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్, పతీ ఔర్ పత్నీ వంటి సినిమాలతో క్రేజ్‌ సంపాదించుకుంది. త్వరలో భక్షక్‌ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి భక్షక్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)