ఓటీటీలో భయపెడుతూ నవ్వించే సినిమా

Published on Mon, 01/20/2025 - 11:18

సాధారణంగా సినిమాలలో ఓ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్‌ అయితే మరొకటి హారర్‌ జోనర్‌. కానీ ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా ‘భూల్‌ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3). ఇది ‘భూల్‌ భులయ్యా’ సిరీస్‌లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి, మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. ‘భూల్‌ భులయ్యా’ మొదటి భాగం ‘చంద్రముఖి’ సినిమా ఆధారంగా తీసింది. 

కానీ మిగతా రెండు భాగాలను  మాత్రం అదే థీమ్‌తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు ‘భూల్‌ భులయ్యా 3’ సినిమా కథ విషయానికి వస్తే... 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్‌ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ దెయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా బందిస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024లో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్‌గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. 

ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్‌ మాంత్రికుడైన రూహాన్‌ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్‌ రక్తఘాట్‌కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్‌ వేసిన కార్తీక్‌ ఆర్యన్‌(Kartik Aaryan)... తన ఈజ్‌ ఆఫ్‌ యాక్టింగ్‌తో హారర్‌ ఎమోషన్‌ని కూడా హ్యూమర్‌ ఎమోషన్‌తో చక్కగా పలికించాడు. 

ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్(Madhuri Dixit), నేటి వర్ధమాన తార విద్యాబాలన్‌(Vidya Balan) వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతోనూ సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్‌ ఈ సినిమాని ఎక్కడా బోర్‌ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలనివ్వకుండా స్క్రీన్‌ప్లే నడిపించాాడు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ ‘భూల్‌ భులయ్యా 3’ వీకెండ్‌ వాచబుల్‌ మూవీ. 
– ఇంటూరు హరికృష్ణ 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)