Breaking News

రైతు బిడ్డ కోసమే హౌస్‌లో అడుగుపెట్టారా?.. భోలె షావలి సమాధానం ఇదే!

Published on Mon, 11/13/2023 - 14:03

బిగ్ బాస్ సీజన్ -7 మరో వారం ముగిసింది. ఇప్పటి వరకు పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళికి కొత్త కొత్త సర్‌ప్రైజ్‌లతో కంటెస్టెంట్లను ఆశ్చర్యానికి గురి చేశారు బిగ్ బాస్. అయితే గత వారంలో ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించి ఎమోషనల్‌గా మార్చేశారు. ఆదివారం దీపావళి కావడంతో పండుగ రోజే కంటెస్టెంట్స్ అందరికీ కుటుంబ సభ్యులు, స్నేహితులను తీసుకొచ్చి మరింత సర్‌ప్రైజ్ ఇచ్చారు.

అయితే ఆదివారం కావడంతో ఈ వారం ఎలిమినేట్ ఎవరు? అనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో ఒకరు తప్పకుండా బయటకి వెళ్లాల్సిందే.అయితే ఈ వారంలో శివాజీ, రతిక, గౌతమ్‌, యావర్, భోలె ఈసారి నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే శివాజీ, రతిక, గౌతమ్‌ సేఫ్ అయినట్లు ప్రకటించిన బిగ్‌బాస్.. యావర్, భోలె మిగిలారు. చివరికీ తక్కువ ఓట్లు సాధించిన భోలె షావలి ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. బయటకొచ్చే కంటెస్టెంట్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకు హాజరైన భోలె షావలి యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తనదైన శైలితో సమాధానాలు చెప్పి ప్రేక్షకులను కడుప్పుబ్బా నవ్వించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన  ప్రోమో రిలీజ్ కాగా.. నెట్టింట తెగ వైరలవుతోంది.

అసలు బిగ్ బాస్‌కు ఎందుకొచ్చారని యాంకర్ ప్రశ్నించగా.. అంటే నాకైతే పంచభక్ష పరమాన్నం వాళ్లకు ఇచ్చాననే అనుకుంటున్నా అని భోలె షావలి ఆన్సరిచ్చారు. మీరు పల్లవి ప్రశాంత్‌కు డప్పు కొట్టడానికే హౌస్‌లోకి వచ్చారా? అని అడగడంతో.. అతను పాట బిడ్డ, రైతు బిడ్డ అందుకే.. కానీ దాన్ని భజన అనొద్దు అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మీకు బిగ్ బాస్ గేమ్ అర్థమే కాలేదు అంటే ఏమంటారు? అని మరో ప్రశ్న వేయగా.. వస్తు ఉంటే మంచిగా అర్థమైంది.. కానీ అర్థమయ్యే టైమ్‌కి వ్యర్థమైంది అంటూ మరోసారి నవ్వులు పూయించారు. అమర్‌దీప్ అబద్ధాల కోరు అని అన్నారు? ఎప్పుడు అబద్ధాలు చెప్పారు? అని ప్రశ్నించడంతో.. 'నాకైతే నిజంగా గుర్తులేదు.. నేనెప్పుడు నిజాలే మాట్లాడుతా' అంటూ నవ్వుతూ సమాధానాలిచ్చారు. మొత్తానికి పదో వారంలో ఎలిమినేట్ అయిన భోలె షావలి తన సమాధానాలతో యాంకర్‌నే ముప్పుతిప్పలు పెట్టినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. 

 
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?