Breaking News

'చిరంజీవి ఇబ్బంది పెడుతున్నారా?'.. వైరలవుతోన్న భోళాశంకర్ నిర్మాత వాట్సాప్ చాట్!

Published on Mon, 08/14/2023 - 15:06

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో.. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. తొలిరోజు వసూళ్లు బాగానే రాబట్టినా.. ఆ తర్వాత భారీగా పడిపోయాయి.అదే సమయంలో రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రానికి హిట్ టాక్.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

(ఇది చదవండి: స్కూల్‌ ఫ్రెండ్స్‌తో రీ యూనియన్‌ అయిన టాప్‌ హీరో.. ఫోటోలు వైరల్‌)

ఈ నేపథ్యంలో రెండు రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. తన రెమ్యునరేషన్ కోసం నిర్మాతను మెగాస్టార్ ఇబ్బంది పెడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. చిరుకు పారితోషికం చెల్లించేందుకు నిర్మాత తన ఆస్తులను తాకట్టు పెడుతున్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఇప్పటికే బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ సైతం క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. ఆయనకు ఇంటికి వెళ్లగా.. దగ్గరుండి మరీ బాగా చూసుకున్నారని ట్వీట్ చేశారు. 

అయితే తాజాగా భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సార్ రెమ్యునరేషన్ విషయంలో  మీపై వస్తున్న వార్తలు నిజమేనా అంటూ ఓ మెగా అభిమాని నిర్మాతకు ‍అనిల్‌కు మేసెజ్ చేశారు. ఇది చూసిన అనిల్ సుంకర.. 'అలాంటిదేం లేదు.. నేనే ఫ్లైట్‌లో యూఎస్ వెళ్తున్నా అంటు బదులిచ్చారు. ఇది ఒకసారి చూడండి సార్ అడగ్గా.. దానికి బదులిస్తూ.. 'మీరు అలాంటివేమీ మీరు పట్టించుకోవద్దు.. నేను మెగాస్టార్‌తో మరో సినిమా తీయబోతున్నా. చిరంజీవి చాలా మంచివ్యక్తి. వారి ప్రశ్నలన్నింటికీ సినిమాతోనే సమాధానం చెబుదాం. అంటూ అతనికి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనిల్ సుంకర వాట్సాప్ చాట్ తెగ వైరలవుతోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ చాట్ చూస్తే చిరంజీవికి, నిర్మాతకు మధ్య గ్యాప్ పెరిదిందన్న వార్తలు రూమర్స్ అని అర్థమవుతోంది. 

(ఇది చదవండి: భోళా ఎఫెక్ట్‌.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్‌ )

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు