Breaking News

‘భోళా శంకర్‌’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్‌.. ఎన్ని కోట్లంటే..

Published on Sat, 08/12/2023 - 12:52

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, కీర్తి సురేశ్‌, సుశాంత్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్‌ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ లభించింది. మెగాస్టార్‌ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాలేదు.

(చదవండి: భోళా శంకర్‌ మూవీ రివ్యూ)

‘భోళా శంకర్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌
ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ.28 కోట్ల గ్రాస్‌(రూ.18.61 కోట్ల షేర్‌) వసూళ్లను రాబట్టింది.  తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ. 15.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ.4.50 కోట్లు, సీడెడ్‌- రూ.2 కోట్లు, ఈస్ట్‌-1.50 కోట్లు, వెస్ట్‌- రూ.1.85 కోట్లు, గుంటూరు- రూ.2.07 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, కర్ణాటక, ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 3.1 కోట్లు వసూలు చేసింది. 

టార్గెట్‌ రూ.82 కోట్లు
భోళా శంకర్‌ చిత్రానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రిరీలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా హిట్‌ అవ్వాలంటే మినిమమ్‌ రూ.82 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టాలి. తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ రావడంతో అంత స్థాయిలో వసూళ్లను రాబట్టకపోవచ్చునని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రజనీకాంత్‌ ‘జైలర్‌’సినిమాకు మంచి టాక్‌ రావడంతో ఆ ఎఫెక్ట్‌ కూడా ‘భోళా శంకర్‌’పై పడే అవకాశం ఉంది.

చిరు గత సినిమాల కలెక్షన్స్‌ ఎంత?
ఇక చిరంజీవి గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త తక్కువనే చెప్పాలి. చిరంజీవి గత ఐదు సినిమాల ఫస్ట్‌డే వసూళ్లను పరిశీలిస్తే.. వాల్తేరు వీరయ్య-రూ.22.75 కోట్లు, గాడ్‌ ఫాదర్‌-రూ.12.83 కోట్లు, ఆచార్య- రూ.28.29 కోట్లు, సైరా- రూ. 36.37 కోట్లు, ఖైదీ నెం 150- రూ. 23.16 కోట్ల వసూళ్లను రాబట్టాయి. భోళా శంకర్‌కు తొలి రోజే నెగెటివ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ మరింత తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)