Breaking News

IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్‌లో రక్తం.. ప్రాణం లేని పాప!

Published on Wed, 09/10/2025 - 10:05

తల్లవాలంటే ముందు పెళ్లవాలా? అక్కర్లేదు, ఏ తోడూ లేకుండానే అమ్మనవుతాను అని నిర్ణయించుకుంది కన్నడ నటి భావన రామన్న. అందుకే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఐవీఎఫ్‌ ఎంచుకుంది. కడుపులో కవలలను మోసింది. సీమంతం కూడా బాగా జరిగింది. కానీ డెలివరీ రోజు ఒక శిశువు మాత్రమే ప్రాణంతో దక్కింది. ఓ శిశువును కోల్పోయింది.

టైం బాంబ్‌పై కూర్చున్నావ్‌
ఈ విషాదం గురించి భావన (Bhavana Ramanna) మాట్లాడుతూ.. సీమంతం తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. కొన్నిసార్లు స్పాటింగ్‌ (రక్తస్రావం) కనిపించేది. నేను వెళ్లే హాస్పిటల్‌ చాలా దూరంలో ఉండటంతో దగ్గర్లోనే మంచి డాక్టర్‌ను చూసుకుంటే అయిపోతుందన్నారు. మా బంధువులు ఎక్కువగా డెలివరీ అయిన డాక్టర్‌ దగ్గరకు వెళ్లి కలిశాను. ఆమె నన్ను చూడగానే.. భావన, నువ్వో టైం బాంబ్‌ మీద కూర్చున్నావ్‌.. తెలుసా? అంది. 

పాప చనిపోయింది
వెంటనే నాకు అన్ని పరీక్షలు చేసింది. సాధారణంగా బొడ్డుతాడు ద్వారా శిశువుకు రక్తం అందుతుంది. కానీ టెస్ట్‌లో అది రివర్స్‌లో జరుగుతుందని తేలింది. అలాగే ఓ శిశువు గుండె కొట్టుకునే వేగం సగానికి సగం తగ్గిపోయిందని తెలిసింది. పైగా సరైన బరువు కూడా లేదని డాక్టర్‌ చెప్పింది. అప్పటికప్పుడు నాకు ఆపరేషన్‌ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒక బిడ్డ చనిపోయిందని చెప్పగానే నాకు మాటలు రాలేదు. 

అమ్మమ్మ పేరే పెట్టా..
పుట్టిన బిడ్డ కోసం సంతోషపడాలా? చనిపోయిన పాప కోసం ఏడవాలా? ఏదీ అర్థం కాని స్థితిలో ఉండిపోయాను. నా కూతురికి రుక్మిణి అని మా అమ్మమ్మ పేరు పెట్టాను. తను ఆగస్టు 20న జన్మించింది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది.

చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)