Breaking News

కుమారుడి పేరు రివీల్ చేసిన ప్రముఖ బుల్లితెర నటి

Published on Wed, 01/28/2026 - 19:35

ప్రముఖ కమెడియన్ భారతి సింగ్, హర్ష్ లింబాచియా దంపతులు తమ కుమారుడి పేరును రివీల్ చేశారు. డిసెంబర్ 19న రెండో బిడ్డకు జన్మనిచ్చిన భారతి సింగ్‌ ఇవాళ తన కొడుకు నామకరణ వేడుకను నిర్వహించారు. తమ ముద్దుల కుమారుడికి యశ్‌వీర్‌ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేక్ చేశారు. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు నైస్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. వీరికి ఇప్పటికే లక్ష్ అనే కుమారుడు ఉన్నారు. ఈషా సింగ్, కరిష్మా తన్నా, అదా ఖాన్, కిష్వర్ మర్చంట్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా.. నటి, కమెడియన్ భారతి సింగ్ పలు సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోస్‌లోనూ పాల్గొంది. ది కపిల్ శర్మ షో, ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి షోలలో మెరిసింది. ఇటీవల ప్రసవం తర్వాత వెంటనే లాఫ్టర్ చెఫ్స్ ఫన్ అన్‌లిమిటెడ్ సీజన్- 3 సెట్స్‌లో కనిపించింది. ఈ దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు లక్ష్ సింగ్ లింబాచియా ఉన్నాడు. వీరికి 2022లో మొదట కుమారుడు జన్మించాడు. ఈ జంట కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు.

 

 

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)