Breaking News

ప్రేక్షకులందరూ ఎంజాయ్‌ చేస్తారు: రవితేజ

Published on Sun, 01/11/2026 - 01:17

‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని చాలా అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీశారు కిషోర్‌. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ నెల 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేటర్స్‌లో కలుద్దాం. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్‌ చేస్తారు’’అని హీరో రవితేజ చెప్పారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ–‘‘సుధాకర్‌ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు.

కానీ, సినిమాని చాలా ఫ్యాషన్‌తో చేశారు. అనిల్‌ రావిపూడి, హరీష్‌ శంకర్, బాబీ, కిషోర్‌.. వీరి డైరెక్షన్లో ఎంజాయ్‌ చేస్తూ వర్క్‌ చేస్తాను. నెక్ట్స్‌ శివ నిర్వాణతో చేస్తున్నాను. మా ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్‌ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోస్‌ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు కెమెరామేన్‌ ప్రసాద్‌ మూరెళ్ల. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. డింపుల్, ఆషిక, సునీల్, సత్య, కిషోర్, మురళీధర్, గెటప్‌ శీను అద్భుతంగా చేశారు. భీమ్స్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు’’అని తెలిపారు.

కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని చాలా ఎంజాయ్‌ చేస్తూ వర్క్‌ చేశాను. మా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘జనవరి 13న మా బీఎమ్‌డబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్‌కి వెళ్లండి.. అదిరి΄ోతుంది’’ అని సుధాకర్‌ చెరుకూరి తెలిపారు. ‘‘నాకు డైరెక్టర్‌గా జన్మ, పునర్జన్మ ఇచ్చింది రవితేజగారే. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’’ అని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చెప్పారు. ‘‘త్వరలోనే రవితేజగారితో సినిమా చేస్తాను’’ అన్నారు డైరెక్టర్‌ బాబీ. ‘‘ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్‌ శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ మూవీతో కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ కొడుతున్నారు’’ అన్నారు డైరెక్టర్‌ పవన్‌.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు