భారతీరాజా నెరవేరని కోరిక ఇదే

Published on Thu, 06/11/2026 - 08:27

తన బంధువులందరినీ ఒకే చోటికి పిలిచి, పెద్ద విందు ఏర్పాటు చేసి అందరితో కలిసి సంతోషంగా గడపాలని భారతీరాజా ఆశపడ్డారని, అయితే, ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారంటూ బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తేని జిల్లాలోని అల్లి నగరం (కీరైకల్‌ స్ట్రీట్‌)లో భారతీ రాజ తల్లిదండ్రులు పెరియమాయ దేవార్‌, కరుత్తమ్మ నివసించే వారు. భారతీరాజా తోబుట్టువులైన చెల్లెలు భారతి తన అన్నయ్యను గుర్తుచేసుకుంటూ రోదిస్తున్నారు. ‘అన్నయ్యకు తాను అంటే చాలా ఇష్టమని, అందుకే తన అసలు పేరైన చిన్నస్వామిని మార్చుకుని.. తన పేరులోని మొదటి ముక్కను (భారతి), అన్నయ్య జయరాజ్‌ పేరులోని రెండో ముక్కను (రాజా) కలిపి ’భారతీరాజా’ అని పేరు మార్చుకున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం, నాటకాలు వేయడం ఆయనకు అలవాటు‘ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కుమారుడి మరణం.. గుండెకోత
ఆయన బంధువులు సుబ్బురాజ్‌, రవి మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన సొంత ఊరికి, తను చిన్నప్పుడు పెరిగిన ఇంటికి తరచూ వచ్చేవారన్నారు. గతంలో కంబమ్‌ ప్రాంతంలో జరిగిన ఒక కుటుంబ వేడుకకు వచ్చినప్పుడు బంధువులందరినీ చూసి ఎంతో సంబరపడ్డారని పేర్కొన్నారు. సొంత వాళ్లందర్నీ పిలిచి ఒక పెద్ద విందు ఇవ్వాలని ఎప్పుడూ అనేవారని, కుమారుడు మనోజ్‌ మరణించడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారన్నారు. దాంతో ఆ విందు కోరిక నెరవేరకుండానే నిష్క్రమించారు అని పేర్కొన్నారు.

తోటలోనే అంత్యక్రియలు..
తాను మరణిస్తే తేని జిల్లాలోని దేవదానపట్టి కాట్‌రోడ్‌ పరిసరాల్లో ఉన్న తన సొంత తోటలోనే(ఫామ్‌ హౌస్‌) అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన తరచూ చెప్తుండేవారని, ఆయన చివరి కోరిక మేరకే భౌతికకాయాన్ని తేని జిల్లాకు తీసుకొచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నామని బంధువులు తెలిపారు. తాజాగా భారతీ రాజాతీ అల్లి నగరం లాంటి చిన్న పల్లెటూరులో విషాదం నెలకొంది. బంధువులు, తేని జిల్లా ప్రజలను, ఆయన అభిమానులను తీవ్ర శోకసముద్రంలో ముంచెత్తింది. ఈరోజు సాయంత్రం తేని బంగళామేడు ప్రాంతంలో జిల్లా అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)