Breaking News

అర్ధ సెంచరీ కొట్టిన హీరో భరత్‌!

Published on Sat, 07/15/2023 - 14:30

తమిళంలో బాయ్స్‌, కాదల్‌ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు భరత్‌. ఆ తర్వాత పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ఇప్పుడు అర్ధ సెంచరీ మైలురాయికి చేరుకున్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం లవ్‌. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన లవ్‌ చిత్రానికి ఇది తమిళ రీమేక్‌. వాణిభోజన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్పీ బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

నటుడు వివేక్‌ ప్రసన్న రాధారవి జూనియర్‌ ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి పీజీ ముత్తయ్య ఛాయాగ్రహణం, లోని రప్పీల్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు.

పెళ్లయిన జంట మధ్య ప్రేమ, సంతోషం, కోపం, చిన్నచిన్న గొడవలు చివరికి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయన్నదే ఈ చిత్ర కథ అని తెలిపారు. ఒక సంఘటనలో పొరపాటున భరత్‌ కారణంగా అతని భార్య హత్యకు గురవుతుందన్నారు. దానిని మార్చడానికి భరత్‌ తన స్నేహితులతో కలిసి ఏం చేశాడు? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఈ చిత్రం తనుకు చాలా ముఖ్యమైనదని నటుడు భరత్‌ పేర్కొన్నారు. కాగా మిరల్‌ చిత్రం తర్వాత భరత్‌తో కలిసి లవ్‌ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని వాణిభోజన్‌ అన్నారు.

చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)