Breaking News

'భారతీయుడు 2' ఆ ఓటీటీలోనే.. ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

Published on Fri, 07/12/2024 - 13:51

ఎట్టకేలకు భారతీయుడు తాత థియేటర్లలోకి వచ్చేశాడు. అప్పుడెప్పుడో 1996లో వచ్చిన సినిమాకు సీక్వెల్‌ని తాజాగా బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చేసింది. మరోవైపు ఈ చిత్ర ఓటీటీ పార్ట్‌నర్ ఎవరనేది కూడా క్లారిటీ వచ్చేసింది. అలానే స్ట్రీమింగ్ డేట్ కూడా ఇదే కావొచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?)

కమల్ హాసన్ - శంకర్ కాంబోలో అప్పట్లో వచ్చిన 'భారతీయుడు'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. తీసింది తమిళంలో అయినా తెలుగు డబ్బింగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక కొన్నేళ్ల క్రితం రెండో భాగాన్ని మొదలుపెట్టగా.. కొవిడ్, షూటింగ్ స్పాట్‌లో ప్రమాదం వల్ల ఏళ్లకు ఏళ్లు లేట్ అవుతూ వచ్చింది. చివరకు ఎలాగోలా పూర్తి చేసి ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొచ్చారు.

సినిమా మరీ ల్యాగ్ ఉందని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. తాతయ్య మరీ విసిగించేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే 'భారతీయుడు 2' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే 6-8 వారాల తర్వాత రావొచ్చు. కానీ టాక్ తేడాగా వస్తుండటంతో 4-5 వారాల్లోపే వచ్చే అవకాశముంది. దీనిబట్టి చూస్తే ఇండిపెండెన్స్ డే వీక్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు)

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)