Breaking News

భారతీయుడు 2 రిలీజ్‌.. టెన్షన్‌లో రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌!

Published on Thu, 07/11/2024 - 16:04

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన భారతీయుడు 2 రేపు(జులై 12) విడుదల కానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్‌ లేకపోయినా.. తెలంగాణలో మాత్రం టికెట్స్‌ రేట్స్‌ పెంచడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు కంటే తెలంగాణలోనే టికెట్‌ ధరలు అత్యధికం. ఇది సినిమాకు ప్లస్‌ అవుతుందా లేదా అనేది రేపటి టాక్‌ని బట్టి తెలుస్తుంది. 

ఇప్పటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అంతంత మాత్రంగానే ఉన్నాయి. హిట్‌ టాక​్‌ వస్తే.. ఆటోమేటిక్‌గా బుకింగ్స్‌ పెరుగుతాయి. ఒకవేళ నెగెటివ్‌ టాక్‌ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2ని ఆదరించడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ థియేటర్స్‌లో ‘కల్కి 2898 ఏడీ’ దుమ్ము రేపుతోంది. వీకెండ్‌లో చాలా మంది కల్కి 2898 మూవీ చూసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

(చదవండి:  తెలుగులో ఇలా.. అక్కడేమో అలా.. టికెట్‌ ధరల్లో ఇంత తేడాలేంటి?)

ఇన్ని సవాళ్ల మధ్య రిలీజ్‌ అవుతున్న భారతీయుడు 2 కచ్చితంగా విజయం సాధించాలని రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. దానికి కారణంగా డైరెక్టర్‌ శంకరే. ఆయన దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్‌ కూడా పూర్తి కావోస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలో చివరల్లో ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. రేపు విడుదలవుతున్న భారతీయుడు రిజల్ట్‌ కచ్చితంగా ఈ సినిమాపై ఉంటుంది. అది హిట్‌ అయితే గేమ్‌ ఛేంజర్‌కి ప్లస్‌ అవుతుంది. 

(చదవండి: కమల్‌ హాసన్‌ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు)

ఒకవేళ ఫ్లాప్‌ అయితే మాత్రం గేమ్‌ ఛేంజర్‌కు కాస్త ఇబ్బందే. అదే ఇప్పుడు చరణ్‌ ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. అసలే శంకర్‌కి సాలిడ్‌ హిట్‌ లేక చాలా కాలం అవుతుంది. భారతీయుడు2తో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు సిద్ధార్థ్‌ కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇందులో ఆయన పోషించింది చిన్న పాత్రే అయితే..హిట్‌ అయితే మాత్రం మంచి పేరే వస్తుంది. రకుల్‌కి కూడా భారతీయుడు2 హిట్‌ చాలా అవసరం. మరి వీరిద్దరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)