Breaking News

భారతీయుడు 2 కలెక్షన్స్‌.. ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా లేవు

Published on Sat, 07/13/2024 - 10:58

కమల్‌ హాసన్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.  1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా జులై 12న ఈ మూవీ విడుదలైంది. ఇందులో కమల్‌ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. అయితే, సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని చాలామంది క్రిటిక్స్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సినిమాకు మొదటిరోజు  కలెక్షన్స్‌ కూడా పెద్దగా రాబట్టలేదని తేలుతుంది.

(చదవండి: : ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)

ఇండియ‌న్ 2 మూవీ తొలిరోజు రూ.  26.1 కోట్ల నెట్‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ్‌ వర్షన్‌లో రూ. 16 కోట్లు వస్తే.. తెలుగులో రూ. 8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అయితే మరీ దారణంగా కలెక్షన్స్‌ వచ్చాయి. బాలీవుడ్‌లో మొదటిరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. శంకర్‌ లాంటి పాన్‌ ఇండియా రేంజ్‌ డైరెక్టర్‌ సినిమాకు బాలీవుడ్‌లో ఇంత తక్కువ కలెక్షన్స్‌ రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

2022లో విడుదలైన విక్రమ్‌ సినిమా మొదటిరోజు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, భారతీయుడు 2 మూవీ మాత్రం విక్రమ్‌ కలెక్షన్స్‌కు దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోయింది. ఇదే క్రమంలో డైరెక్టర్‌ శంకర్‌ చివరి సినిమా రోబో 2.ఓ తొలిరోజు భారీ కలెక్షన్స్‌ రాబట్టింది.  ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా రాబట్టింది. 

భారతీయుడు 2 సినిమా బాగాలేదంటూ ఇప్పటికే మోత్‌ టాక్‌ పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా తెలంగాణలో ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచారు. ఈ ప్రభావం భారతీయుడు 2 కలెక్షన్ల మీద భారీగా పడనుంది. ఒక డబ్బింగ్‌ సినిమాకు టిక్కెట్ల ధరలు పెంచుకోవడం ఏంటి..? అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కమల్‌ హాసన్‌ లాంటి స్టార్‌ హీరో సినిమా కదా చూసేద్దామని కుటుంబంతో వీకెండ్‌లో సినిమా ప్లాన్‌ చేసుకునే వారు కూడా భారతీయుడు వైపు వెళ్లకుండా చేసేలా టికెట్ల ధరలు ఉన్నాయిని నెటిజన్లు వాపోతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)