Breaking News

చైనాకు వంత పాడుతున్నారా?.. సెన్సార్ బోర్డుపై నిర్మాత సంచలన కామెంట్స్!

Published on Mon, 07/03/2023 - 21:36

ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్‌  దీన్‌ రాజ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్‌’.  నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

శంకర్ నాయుడు అడుసుమిల్లి మాట్లాడుతూ..'మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన మొదటి సినిమా ఇది. భారతీయ మూలాలు కలిగి, అమెరికాలో స్థిరపడిన తెలుగువాడిని. అతి త్వరలో మీ ముందుకు "భారతీయన్స్" చిత్రాన్ని తీసుకొస్తాం. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు.  చైనా దాడులు, బ్యాక్‌స్టాబ్‌లు చాలావరకు మీకు తెలిసి ఉండవచ్చు.' అని అన్నారు. 

 చైనా వక్రబుద్ధిపై మాట్లాడుతూ.. 'చైనా మనతో ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దులలో ఒకటిగా ఉంది. చైనా ఎల్లప్పుడూ మన వెనుక కత్తితో దాడి చేసే శత్రువు. అత్యంత ప్రమాదకరమైన, మోసపూరిత, దుర్మార్గమైన చైనా... కొన్ని శతాబ్దాల క్రితం బ్రిటీష్ వారిలాగే సాధ్యమైన ప్రతి దేశాన్ని వలసరాజ్యం చేయడానికి ప్రయత్నిస్తూ అధికారంలో ఉండటానికి దాని స్వంత ప్రజలను సైతం చంపుతుంది. ఈ దుర్మార్గపు, నిరంకుశం గురించి మా సినిమా భారతీయన్స్‌లో ఎండగట్టాం.' అని అన్నారు. 

దురదృష్టవశాత్తు సెన్సార్ బోర్డు నన్ను సినిమాలో చైనా పేరును ఉపయోగించవద్దని కోరిందని తెలిపారు. మరింత విచారంగా గాల్వాన్ వ్యాలీ పేరును కూడా తొలగించమని అడిగారు. ఇది ఎంత అరాచకం? ఎంత అవమానకరం? గాల్వాన్ వ్యాలీని చైనాకు అప్పగిస్తున్నామా? మనం చైనాకు లొంగిపోతున్నామా? మీ అందరికీ ఇదే నా విజ్ఞప్తి. మీ అందరూ భారతీయన్స్ చిత్రానికి మద్దతు ఇవ్వాలని శంకర్ నాయుడు కోరారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)