Breaking News

'భారతీయన్స్' సినిమా రివ్యూ

Published on Fri, 07/14/2023 - 18:09

టైటిల్: భారతీయన్స్
నటీనటులు: నీరోజ్ పుచ్చా, సుభా రంజన్, సోనమ్ టెండప్ తదితరులు
నిర్మాత: డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి
దర్శకుడు: దీనరాజ్
సంగీతం: సత్య కశ్యప్, కపిల్ కుమార్
సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల
విడుదల తేదీ: జూలై 14

దేశభక్తిని చాటే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మన సైనికుల ప్రాణ త్యాగాలు, శత్రు దేశాల కుట్రలను చూపిస్తూ ఇప్పటికే చాలానే మూవీస్ వచ్చాయి. ఇప్పుడు 'భారతీయన్స్' పేరుతో ఓ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ప్రవాస భారతీయుడు శంకర్ నాయుడు నిర్మించగా.. దీనరాజ్ దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ)

కథేంటి?
ఈ కథలో పాత్రలకు పేర్లుండవు. ప్రాంతాల పేర్లతో పిలుస్తుంటారు. అలా భోజ్ పురి, తెలుగు, నేపాలీ, బెంగాలీ, త్రిపుర, పంజాబీలు ఇలా ఆరుగురు ఒకే చోటకు చేరుతారు. వాళ్లందరికీ కొందరు ట్రైనింగ్ ఇస్తారు. చివరకు వారిని ఇండియన్ బోర్డర్ దాటి చైనాలోకి వెళ్లమని చెబుతారు. అక్కడి గెస్ట్ హౌస్‌లోని ల్యాబ్‌లో ఏం జరుగుతోంది? అక్కడి సీక్రెట్స్ ఏంటో తెలుసుకు రావాలని చెబుతారు. అసలు ఆ ఆరుగురు ఒకే చోటకు ఎందుకు వచ్చారు? వారి నేపథ్యం ఏంటి? వారికి ట్రైనింగ్ ఇచ్చిన వారు ఎవరు? చైనా వాడు వేసిన ఎత్తు ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. 

ఎలా ఉందంటే?
దేశభక్తి సినిమాలు, సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద కుట్రలు, చైనా, పాకిస్థాన్, ఇండియా అనే అంశాల మీద సినిమా తీయడం అంటే సాహసమే. ఆ సాహసాన్ని నిర్మాత శంకర్, దర్శకుడు దీనరాజ్ చేశారు. అయితే ఈ దేశ భక్తి సినిమాను ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. నటీనటుల ప్రభావం ఆడియెన్స్ మీద మరి కొంత పడుంటే బాగుండేది.

ప్రథమార్థం అంతా పాత్రల పరిచయం, వారి వారి నేపథ్యాలు చూపించడంతో గడిచింది. ద్వితీయార్థంలోనే అసలు కథ, ట్విస్టులుంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. చివరి పది నిమిషాలు దేశ భక్తి రగిల్చేలా ఉంటుంది. క్లైమాక్స్ కోసం బాగానే కష్టపడినట్లుగా కనిపించింది. సినిమా ముగింపు అందరినీ కదిలిస్తుంది. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని చాటి చెప్పే చిత్రమిది.

ఎవరెలా చేశారు?
'భారతీయన్స్' సినిమాలో ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయి. దేశభక్తిని చాటే సన్నివేశాలుంటాయి. వాటిలో నటీనటులు చక్కగా నటించారు. భోజ్ పురి, పంజాబీ, నేపాలి, త్రిపుర, తెలుగు, బెంగాలి ఇలా అందరూ చక్కగా నటించారు. పంజాబీ, త్రిపుర, బెంగాలి పాత్రల్లో చేసి అమ్మాయిలు తెరపై అందంగా కనిపించారు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లోనూ మెప్పించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సిక్కిం ఏరియా, సరిహద్దు ప్రాంతాలను చక్కగా కెమెరామెన్ చూపించారు. సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్లని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే దేశభక్తి నేపథ్యంలో సినిమా తీయడం నిజంగా అభినందనీయం.

(ఇదీ చదవండి: ‘మహావీరుడు’ మూవీ రివ్యూ)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)