శివభక్తుడు 'కన్నప్ప'ది ఏ ఊరో తెలుసా..?

Published on Mon, 07/07/2025 - 17:00

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా విడుదల తర్వాత నేటి యువత అందరూ ఆయన స్వగ్రామం గురించి ఆరా తీస్తున్నారు. పరమశివుడికి అత్యంత గొప్ప భక్తుడిగా చరిత్రలో నిలిచిపోయిన కన్నప్ప మన తెలుగు గడ్డపై జన్మించినట్లు ఆధారాలు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు అనే గ్రామమే కన్నప్ప స్వస్థలమని చెబుతారు.  ఈ ఊరిలోనే స్వామి వారి విగ్రహానికి కన్నప్ప ప్రత్యేక పూజలు చేశారని, ఆయన ఇక్కడే నివాసం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో నిజం అని నిర్ధారించుకున్నారు. అక్కడ కన్నప్ప ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే భక్త కన్నప్ప విగ్రహంతో పాటు అన్నమాచార్యుల విగ్రహం కూడా ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. అది కన్నప్ప స్వగ్రామమే కాకుండా అన్నమయ్య అమ్మమ్మ ఊరు కూడా అదేనని చెబుతారు.

కన్నప్ప పేరు వినగానే ప్రతి భక్తుడికి గుర్తుకు వచ్చే అంశం తాను ఆరాధించే దైవానికి లోకాన్ని చూసే కళ్లనే తృణప్రాయంగా సమర్పించుకున్న భక్తి గాధ వినిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటుకూరును పూర్వం ఉడుప్వూరు అని పిలిచేవారని శాసనాల్లో ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన శేక్కిలారుముని రాసిన శివ భక్తుల చరిత్రలో కన్నప్ప ఊరి గురించి పేర్కొన్నారు. కన్నప్ప జన్మ స్థలం ఊటుకూరుగా వారు పేర్కొన్నారు. చాలామంది పరిశోధనలు చేసిన తర్వాత కన్నప్పది ఊటుకూరే అని నిర్ధారించారు. ఆయన 3102 BCE కాలానికి చెందిన వ్యక్తిగా వారు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం మంచు విష్ణు కూడా తన యూనిట్‌తో  ఈ గ్రామంలో ఉన్న కన్నప్ప ఆలయాన్ని సందర్శించారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)