Breaking News

తెలుగు సినిమా నాటి నుంచి నేటి దాకా...

Published on Fri, 02/06/2026 - 00:20

తెలుగు సినిమాకు ఇవాళ పండగ రోజు. తొలి పూర్తి నిడివి తెలుగు చలనచిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఇప్పటికి 94 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. దానినే కొన్నేళ్ళుగా ‘తెలుగు సినిమా దినోత్సవం’ (తెలుగు సినిమా డే)గా సినీ పరిశ్రమ, సంస్థలు చేస్తున్నారు. హెచ్‌.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై, 1932 ఫిబ్రవరి 6న రిలీజైన ఆ సినిమాతో పూర్తి నిడివి తెలుగు టాకీల నిర్మాణం ఆరంభమైంది. అంతకు ముందు మాటలు,  పాటలు ఏమీ లేకుండా బొమ్మలు మాత్రం కదిలే మూగ సినిమాలు వచ్చేవి. భాషతో ప్రమేయం లేని సినిమాలు గనక అవి భాషా, ప్రాంతీయ సరిహద్దులు చెరిపేసి, అందరినీ ఆకర్షించేవి. 1931 మార్చి 14న హిందీ, ఉర్దూల సమ్మిశ్రమ భాషలో తొలి భారతీయ టాకీ ‘ఆలమ్‌ ఆరా’ విడుదలైంది. 

అక్కడ నుంచి క్రమంగా వివిధ భారతీయ భాషల్లో మాటలున్న సినిమాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్‌ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్‌.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్‌’ను రూపొందించారు. అదీ బొంబాయిలోనే తీశారు! నిజానికి, తెరపై తొలిసారిగా మన తెలుగు మాటలు, తెలుగు త్యాగరాయ కీర్తనలు వినిపించింది ఆ ‘కాళిదాస్‌’ సినిమాలోనే! అది 1931 అక్టోబర్‌ 31న మద్రాసులో విడుదలైంది. 

ఆ వెనువెంటనే మళ్ళీ హెచ్‌.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే ఈసారి ఏకంగా 10 రీళ్ళ పూర్తి నిడివి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ‘‘100% సంపూర్ణ తెలుగు టాకీ’’గా ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే జరిగాయి. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్‌ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న జనం ముందుకు వచ్చింది. ఆ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ విడుదలై, నేటితో 94 ఏళ్ళు పూర్తయ్యాయి. 

మన ‘భక్త ప్రహ్లాద’ రూ. 18 వేలతో, 18 రోజుల్లో నిర్మాణమైంది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, ప్రసిద్ధ సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఆ సినిమా తీశారు. అప్పటికే తెలుగునాట నాటక రచయితగా ప్రసిద్ధుడైన చందాల కేశవదాసు ఆ సినిమాలో  పాటలు అందించారు. తొలి తెలుగు సినీ గేయరచయితగా కీర్తి గడించారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలా బాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్‌ కృష్ణారావు ముఖ్య పాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్‌.వి. ప్రసాద్‌ మొద్దబ్బాయిగా నటించారు. బొంబాయిలోని కృష్ణా సినిమా హాలులో ఈ ‘భక్త ప్రహ్లాద’ ముందుగా విడుదలైంది. అటుపైన విజయవాడ (శ్రీమా రుతి హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా హాలు)ల్లో ప్రదర్శితమైంది. తర్వాత మద్రాసులో ఏప్రిల్‌ 2న రిలీజైంది. 

అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెరపై బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆడడం,  పాడడం పెద్ద విడ్డూరమైంది. దాంతో, ‘కాళిదాస్‌’, ఆ వెంటనే ‘భక్త ప్రహ్లాద’ టాకీల విడుదల సంచలనం సృష్టించింది. అలా మొదలైన మన తెలుగు సినిమా ప్రభ ఎందరో మహామహుల జీవితకృషి కారణంగా ఇవాళ దేశాల సరిహద్దుల్ని దాటింది. ఇటీవలి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో అంతర్జాతీయంగా ఆస్కార్‌ అవార్డు అందుకొనే దాకా ఎదిగింది. అలనాటి ‘మల్లీశ్వరి’, ఆ మధ్య ‘శంకరాభరణం’ నుంచి నిన్నటి ‘బాహుబలి’ మీదుగా రానున్న రాజమౌళి – మహేశ్‌బాబుల ‘వారణాసి’ దాకా మన తెలుగు సినిమా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)