అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తారకరామం పుస్తకం బహుకరణ
Published on Fri, 05/30/2025 - 20:59
మహా నటుడు, ప్రజా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి 'తారకరామం' పుస్తకాన్ని బహుకరించానని సీనియర్ జర్నలిస్ట్ రచయిత జి. భగీరథ తెలిపారు. ఎన్టీఆర్ రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఆధ్వర్యంలో 'శకపురుషుడు ' , 'తారకరామం' అనే రెండు పుస్తకాలు తన సంపాదకత్వంలో వెలువడ్డాయని భగీరథ చెప్పారు.
ఈనెల 28 వ తేదీన ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో కలసి పుస్తకాన్ని అందించినట్లు భగీరథ వెల్లడించారు. 1950 నుంచి 1995 మధ్యకాలంలో రామారావు ఇచ్చిన ఇంటర్వ్యూలతో ఈ పుస్తకం రూపొందించినట్లు తెలిపారు. ఆయన జయంతి రోజున 'తారకరామం ' ప్రత్యేక గ్రంథాన్ని కానుకగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Tags : 1