Breaking News

మారిపోయిన మనిషిని గుర్తు చేసేలా ‘అరి’ థీమ్‌ సాంగ్‌

Published on Sat, 04/05/2025 - 16:19

‘పేపర్‌ బాయ్‌’ఫేం జయశంకర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక.వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచారు మేకర్స్‌.

ఇప్పటికే ఈ చిత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలకు చూపించగా..వారంతా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ తరం తప్పకుండా చూడాల్సిన సినిమా అని సూచించారు. ఇక తాజాగా ఈ చిత్రం థీమ్‌ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

‘మషినేనా నువ్వు..ఏమై పోతున్నావ్‌.. మృగమల్లే జారీ..దిగజారిపోయావ్‌’ అంటూ సాగే ఈ పాటకు వనమాలి లిరిక్స్‌ అందించగా..  షణ్ముఖ ప్రియ అద్భుతంగా ఆలపించింది. ఇక అనూప్‌ రూబెన్స్‌ తనదైన సంగీతంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమాలోని కీలక పాత్రలన్నింటిని పరిచయం చేస్తూ.. అసలు ఈ సినిమా కథేంటి? ఎం సందేశం ఇవ్వబోతుందనే విషయాలను తెలియజేలా థీమ్‌ సాంగ్‌ ఉంది. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని చిత్రబృందం పేర్కొంది. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)