Breaking News

సినీ తారలకు ఈడీ పిలుపు

Published on Tue, 07/22/2025 - 05:54

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ యాప్‌లను ప్రమోట్‌ చేసిన సెలబ్రెటీలను విచారించేం­దుకు అధికారులు సిద్ధమవుతు­న్నారు. తేదీల వా­రీ­గా సినీతారలకు విచారణకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ మేరకు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్‌ దేవరకొండ, మంచులక్ష్మిలకు వేర్వేరుగా సోమవారం సమన్లు జారీ చేసింది. బుధవారం రానా దగ్గుబాటి, ఈ నెల 30న ప్రకాశ్‌రాజ్, ఆగస్టు 6న విజయ్‌ దేవరకొండ, 13న మంచు లక్ష్మిలను విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.

బెట్టింగ్‌ యాప్‌లకు ప్రమోషన్‌ చేయడంలో వారి పాత్ర..ఇందుకు సంబంధించి ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు..తీసుకున్న పారితోష­కాల వివరాలు, అందుకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకుని హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ ఆఫీసులో హాజరు­కావాలని సూచించారు. సైబరాబాద్, సూర్యా­పేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్‌ యాప్‌లపై నమోదైన వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) రిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే. లోన్‌ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది.  

Videos

బంగారం కొనుగోలుపై మోదీ కీలక వ్యాఖ్యలు

పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి

నేపాల్ లో అదృశ్యమైన హైదరాబాద్ వాసి..

పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

AP: నాగమల్లేశ్వరి అరెస్ట్

విశాఖలో పుష్ప శ్రీ వాణి అరెస్ట్

పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

Photos

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు