Breaking News

సారీ చెప్పిన అనన్య నాగళ్ల.. మరి ఇదేంటని ప్రభుత్వానికి సూటి ప్రశ్న!

Published on Fri, 03/21/2025 - 18:14

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినవారిలో యూట్యూబర్ల నుంచి సినిమా స్టార్ల వరకు చాలామంది ఉన్నారు. అయితే వీరిలో కొంతమందికి ఈ యాప్స్‌ గురించి కనీస అవగాహన లేదు. నిమిషానికి లక్షలు ఇస్తున్నారనగానే ముందూవెనకా ఆలోచించకుండా ప్రమోషన్స్‌ చేశారు. ఇప్పుడేమో కేసు (Betting App Case)లో ఇరుక్కుని బాధపడుతున్నారు. ఆ జాబితాలో హీరోయిన్‌ అనన్య నాగళ్ల (Ananya Nagalla) కూడా ఉంది.

అనన్య క్షమాపణలు
అవగాహన లేకపోవడం వల్లే సదరు యాప్స్‌ను ప్రమోట్‌ చేశామని అంగీకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది. నేను తెలిసి ప్రమోషన్స్‌ చేయలేదు. అందరు సెలబ్రిటీలు చేస్తున్నారు.. కాబట్టి అందులో తప్పేం లేదనుకున్నాను. కానీ ఇకమీదట జాగ్రత్తగా ఉంటాను. బాధ్యతగా మసులుకుంటాను అని పోస్ట్‌ పెట్టింది.

మరి ఇదేంటి? మాకెలా తెలుస్తుంది?
అదే సమయంలో మెట్రో రైళ్లలో బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేయడాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వ ఆస్తులపై బెట్టింగ్‌ యాప్స్‌ను ఇలా యథేచ్చగా ప్రమోట్‌ చేస్తున్నారు. అలాంటప్పుడు అది చట్టరీత్యా నేరమని మాకెలా తెలుస్తుంది? అని ప్రశ్నించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. ఆమె తెలియక చేశానని చెప్పాక నిందించడం సరి కాదని భావిస్తున్నారు. 

మల్లేశంతో కెరీర్‌ మొదలు
మరికొందరేమో.. లక్షల మంది అభిమానులున్నప్పుడు ఏ చిన్న పోస్ట్‌ పెట్టాలన్నా దాని దుష్ప్రభావాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి అని సూచిస్తున్నారు. మల్లేశం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది అనన్య నాగళ్ల. ప్లే బ్యాక్‌, వకీల్‌ సాబ్‌, మాస్ట్రో, మళ్లీ పెళ్లి వంటి పలు సినిమాలు చేసింది. గతేడాది.. తంత్ర, డార్లింగ్‌, పొట్టేల్‌, శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌ సినిమాలతో మెప్పించింది.

చదవండి: ప్రముఖ నటి రజిత ఇంట విషాదం.. తల్లి కన్నుమూత

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)