Breaking News

విషమివ్వాలని దర్శన్ విజ్ఞప్తి.. బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు!

Published on Wed, 09/10/2025 - 17:32

కన్నడ హీరో దర్శన్ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రేణుకాస్వామి అనే అభిమాని హత్యకేసులో నిందితుడైన ఆయనను బెయిల్ రద్దు కావడంతో అరెస్టై జైలుకు వెళ్లారు. కేసులో దర్శన్తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేసులో విచారణకు వర్చువల్గా హాజరైన దర్శన్‌.. న్యాయమూర్తికి తన బాధలను చెప్పుకొచ్చారు. జైల్లో ఉండలేకపోతున్నానని.. తన పరిస్థితి త్యంత దుర్భరంగా మారిందని అన్నారు. దయచేసి తనకు ఇంత విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు. నా జీవితం దారుణంగా తయారైందని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే దర్శన్పరిస్థితిని అర్థం చేసుకున్న బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు బదిలీ చేయాలన్న అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చడానికి ఎటువంటి బలమైన కారణం లేదని పేర్కొంది. కాగా.. రేణుకాస్వామి హత్య కేసులో 7 మంది నిందితులు వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. దర్శన్ తరపు న్యాయవాదులు కనీసం ఒక మంచం, దిండును అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు దర్శన్జడ్జితో మాట్లాడుతూ.. 'నెల రోజులకు పైనే అవుతుంది ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు.

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు