చిరు ఫైట్‌ సీన్‌ కోసం 6000 కుండలు.. అప్పట్లోనే 50 వేల ఖర్చు!

Published on Sun, 06/04/2023 - 11:56

మెగాస్టార్‌ చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఆపద్బాంధవుడు ఒకటి.  కే. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ చిరంజీవికి మాత్రం మంచి గుర్తింపుతో పాటు నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో చిరు అభిమానుల కోసం ఓ ఫైట్‌ సీన్‌ని పెట్టారు విశ్వనాథ్‌. అది ఎద్దుతో జరిగేది.

ఇందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్‌ అప్పట్లోనే రూ. 50 వేలు ఖర్చు చేసిందట. ఫైట్‌ సీన్‌ కోసం ఆరు వేల కుండలను తెప్పించారట. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారట. పగిలిపోయిన కుండల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త కుండలను పెట్టేవారట. ఇక ఈ ఫైట్‌ సీన్‌ ముగింపు దశకు వచ్చేసరికి కుండల కొరత ఏర్పడిందట.

(చదవండి: అభిమానులకు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేయిస్తా, ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా: చిరంజీవి)

అప్పటికే మద్రాస్‌లో తయారు చేసిన కుండలన్నీ కొనుగోలు చేశారట. మరిన్ని కుండల కోసం చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి కొనుక్కోచ్చారట. ఎంతో కష్టపడి తీసిన ఈ ఫైట్‌ సీన్‌ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. 1992 అక్టోబర్‌ 9న అపద్బాంధవుడు చిత్రం విడుదలైంది. చిరంజీవితో పాటు ఉత్తమ డైలాగ్స్‌ రచయితగా జంధ్యాల, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా భూషన్‌ లకంద్రి, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌గా బి. చలం, అరుణ్‌ బి.గోడ్వంకర్‌లకు నంది అవార్డులు లభించాయి. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)