ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
కార్తికేయ, నేహాశెట్టిల రొమాంటిక్ 'వెన్నెల్లో ఆడపిల్ల' సాంగ్ రిలీజ్
Published on Tue, 03/07/2023 - 12:12
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012". క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్ ఆడియోన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ ఓ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను హారిక నారాయణ్, సుధాన్షు జేవీ ఆలపించారు.
#
Tags : 1