Breaking News

పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్త ఎవరో చెప్పిన 'బర్రెలక్క'

Published on Mon, 03/25/2024 - 09:38

బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలం, మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌గా అందరికీ పరిచయమే. ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో పాటు యువతను ఆలోచించే విధంగా పలు వ్యాఖ్యలు చేస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె సోషల్‌ మీడియా ఖాతాలో తన భర్త వివరాల గురించి నెటిజన్లు ఆరా తీశారు. దీంతో ఆమె తాజాగా ఒక వీడియోను పోస్ట్‌ చేసింది.

తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ప్రకటించిన శిరీష తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోలను కూడా ఆమె రివీల్‌ చేసింది. వారిద్దరూ కలిసి ఓక ఫోటో షూట్‌ కూడా చేశారు. ఆ వీడియోను కూడా శిరీష్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఆమెకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మార్చి 28న వెంకటేశ్‌ అనే అబ్బాయితో శిరీష వివాహం జరగబోతుంది.  అతను ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ పూర్తిచేశాడని తెలుస్తోంది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. మరికల్ గ్రామానికి చెందిన శిరీష ఆమె తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీకి సాయంగా ఉంటూ ఓపెన్‌ డిగ్రీ చదవుతున్నట్లు ఆమె గతంలో పంచుకుంది. 

తెలంగాణ ఎన్నికల సమయంలో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆమె ఎంపీగా కూడా పోటీ చేస్తానని చెప్పింది. తాను ఓడిపోయిన పర్వాలేదు అంటూనే తన పోటీ యువతను మేలుకొల్పేందుకే అని చెప్పింది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)