Breaking News

బార్బరిక్‌ కొత్తగా ఉంటుంది: మారుతి

Published on Sat, 01/04/2025 - 00:12

‘‘మైథలాజికల్‌ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రస్తుత తరానికి వస్తే ఎలా ఉంటుందో ‘బార్బరిక్‌’(Barbaric) లో చూపించారు. ఇది చాలా రిస్కీ జానర్‌ అని చెప్పాను. కానీ, మోహన్, రాజేశ్‌ ఎంతో నమ్మకంతో ఈ సినిమాని చాలా ఖర్చు పెట్టి తీశారు. ఈ మూవీ సరికొత్తగా ఉంటుంది.. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. 

సత్యరాజ్, వశిష్ఠ ఎన్‌. సింహా, సాంచీ రాయ్, ‘సత్యం’ రాజేశ్, ఉదయ భాను ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘బార్బరిక్‌’(Barbaric) . మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతి సమర్పణలో విజయపాల్‌ రెడ్డి అడిదల నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌(Teaser Launch) ఈవెంట్‌కి మారుతి అతిథిగా హాజరై, విడుదల చేశారు.

ఈ సందర్భంగా సత్యరాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఏజ్డ్‌ యాక్షన్‌ హీరో అనే ట్యాగ్‌ కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్‌ వస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది’’ అని విజయపాల్‌ రెడ్డి తెలిపారు. ‘‘బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు ఈ మూవీకి సంబంధించి నాకు మూడు అస్త్రాలు ఉన్నాయి.

 ఒకరు డీఓపీ రమేశ్, రెండు ఫ్యూజన్‌ బ్యాండ్, మూడు ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌. ఈ మూడు అస్త్రాలతో నేను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అన్నారు మోహన్‌ శ్రీవత్స. ‘‘బార్బరిక్‌’ మినీ ‘బాహుబలి’ మూవీలా ఉంటుంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్‌.  ‘‘ఇది నాకు తొలి తెలుగు సినిమా’’ అని సాంచీ రాయ్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: కుశేందర్‌ రమేశ్‌  రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్‌ బ్యాండ్‌.  

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)