Breaking News

త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్‌ సంచలన ట్వీట్‌!

Published on Sat, 05/27/2023 - 09:38

కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్‌. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బం‍డ్ల ఒక సెన్సేషన్‌. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. ఒక వ్యక్తిని పొగడాలన్నా లేదా విమర్శించాలన్నా.. ట్వీటర్‌ని ఆయుధంగా వాడతారాయన. ఆ మధ్య డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌, బండ్ల గణేశ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక తన ట్విటర్‌ అస్త్రాన్ని త్రివిక్రమ్‌పై ప్రయోగించాడు బండ్లన్న. అయితే అక్కడ త్రివిక్రమ్‌ పేరుని ప్రస్తావించకపోయినా.. ‘గురుజీ’ అంటూ పరోక్షంగా ఆయన్ను విమర్శించారు. 

(చదవండి: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబోలో నాలుగో సినిమా!)

అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేశ్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్‌ అవ్వాలని ఉంది’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై హాట్‌ టాపిక్‌గా మారింది. ‘గురూజీని కలవండి. ఖరీదైన బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇక మరో నెటిజన్‌ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్‌ప్లే రాసి అసలు కథను షెడ్‌కు పంపిస్తాడని టాక్‌ ఉంది. నిజమేనా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా బండ్ల తనదైన శైలీలో స్పందించాడు. . ‘‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ సంచలనంగా మారింది.  ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌ను చాలామంది గురూజీ అని పిలుచుకుంటారు. దీంతో బండ్ల ట్వీట్‌ త్రివిక్రమ్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)