Breaking News

రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్‌ఫర్మ్‌ చేసిన బండ్ల గణేశ్‌

Published on Sat, 05/13/2023 - 10:13

ప్రముఖ నటుడు, నిర్మాత  బండ్ల గణేశ్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం చాలా కష్టం. గతంలో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన బండ్ల గతేడాది అక్టోబర్‌లో పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాడు. కుటుంబ బాధ్యతల వల్ల రాజకీయాలకు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. పలు ఇంటర్వ్యూలలోనూ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని కుండ బద్ధలు కొట్టిన ఆయన తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది.

ఈ మేరకు బండ్ల గణేశ్‌ వరుస ట్వీట్లు చేశాడు. మొదటగా 'రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం..' అంటూ అభిమానుల్లో ఆసక్తిని రేపాడు. తర్వాత కాసేపటికే 'నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా' అంటూ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు. మరో ట్వీట్‌లో 'బానిసత్వానికి బైబై, నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై.. రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం..

రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి, రావాలి. అందుకే వస్తా!' అని రాసుకొచ్చాడు. దీంతో బుర్ర గోక్కుంటున్న నెటిజన్లు 'ఇలా యూటర్న్‌ తీసుకున్నావేంటన్నా?', 'ఇంతకీ ఏ పార్టీలో చేరాలనుకుంటున్నావో.. ముందు అది చెప్పు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేశ్‌ ట్వీట్లు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆంజనేయులు, తీన్మార్‌, గబ్బర్‌సింగ్‌, టెంపర్‌, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో హిట్‌ చిత్రాల నిర్మాతగా పేరు సంపాదించాడు బండ్ల గణేశ్‌. నటుడిగానూ పలు సినిమాలతో సత్తా చాటిన ఆయన చివరగా డేగల బాబ్జీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.

చదవండి: లైగర్‌ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)