Breaking News

కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్ల ట్వీట్‌ పవన్‌కేనా?

Published on Wed, 09/24/2025 - 14:18

బండ్ల గణేశ్‌.. కమెడిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నిర్మాతగా మారి బడా చిత్రాలను నిర్మించాడు.ఎన్టీఆర్‌, రవితేజ, పవన్‌ లాంటి స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు నిర్మించి..టాలీవుడ్‌లో కొన్నాళ్ల పాటు అగ్ర నిర్మాతగాను కొనసాగాడు. అయితే గత కొంతకాలంగా ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి చిత్రాలు రావడం లేదు. నటుడిగానూ తెరపై కనిపించడం లేదు. అయినప్పటికీ బండ్ల గణేశ్‌ పేరు ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంటుంది. అందుకు కారణం ఆయన చేసే ప్రసంగాలు.. సోషల్‌ మీడియా పోస్టులు అనే చెప్పాలి. ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌తో ఆయన ఇచ్చే స్పీచ్‌లు వైరల్‌ అవుతుంటాయి. హీరోలను పొగడ్తలతో ముంచేస్తుంటాడు.

ఇక పవన్‌ కల్యాణ్‌కు ఆయన చేసే భజన అంత ఇంతా కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా పవన్‌ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని పవన్‌ కల్యాణ్‌ కొంతకాలంగా దూరం పెట్టినట్లు తెలుస్తుంది. పవన్‌ సినిమా ఈవెంట్స్‌కి బండ్ల గణేశ్ కి ఆహ్వానం అందడం లేదు. ఇటీవల జరిగిన ఓజీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి సైతం బండ్ల గణేష్‌కు పిలుపు రాలేదు. దీంతో పవన్‌పై బండ్లన్న అలిగినట్లు ఉన్నాడు. తన అసహనాన్ని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు’ అని బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశాడు.

ఈ పోస్ట్‌ పవన్‌ కల్యాణ్‌ గురించే చేశాడని నెటిజన్స్‌ అభిప్రాయపెడుతున్నారు. ‘నిజమే.. పవన్‌కి కృతజ్ఞత ఉండదు’, ‘ఈ విషయం ఇదివరకే అర్థమై చెప్పిన వారిపై గయ్యిన లేచే వాడివిగా! గుడ్డి మైకం లో ఉన్నప్పుడు, నీకు కూడా అర్దం కాలేదుగా! అయినా ఎప్పటికీ అర్దం కాని కొంతమంది పిచ్చి మలోకాలు ఎప్పటికీ ఉంటాయి! అందుకే ఎందుకు పనికి రాని వారు అందలం ఎక్కి ఊరేగుతారు! వారు వీరందరినీ పల్లకి మోసే బోయలు మాత్రమే!’ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)