Breaking News

‘రజాకార్‌’ రిలీజ్‌ అయితే కొందరి మైండ్‌ బ్లాక్‌ అవుతుంది: బండి సంజయ్‌

Published on Sat, 07/15/2023 - 10:04

ఖైరతాబాద్‌: సమర్‌ వీర్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రజాకార్‌’ సినిమా పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం జలవిహార్‌లో మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఎంపీ బండి సంజయ్‌, దర్శక నిర్మాత యాటా సత్యనారాయణ, నిర్మాత గూడూరు నారాయణరెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ రజాకార్‌ సినిమా చరిత్రలో నిల్చిపోతుందన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించిన చరిత్ర తెలంగాణది అన్నారు. సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ 18–40 సంవత్సరాల మధ్యవయసు వారికి తెలంగాణ చరిత్ర తెలియదని, ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి తెలంగాణ చరిత్ర తెలుస్తుందన్నారు. కొందరు చరిత్రను తెరమరుగు చేయాలని చూస్తూ, ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ చేస్తున్నారన్నారు. ఈ సినిమా రిలీజ్‌ అయితే కొందరి మైండ్‌ బ్లాక్‌ అవుతుందన్నారు. సోషల్‌ మీడియా వారియర్స్‌, యువత మీడియా ద్వారా రజాకార్‌ సినిమాపై ప్రచారం చేయాలన్నారు.

ఈ సందర్భంగా నటి వేదిక మాట్లాడుతూ..ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సుద్దాల అశోక్‌ తేజ, జితేందర్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, సంగప్ప, విఠల్‌తో పాటు నటుడు బాబి, అనిష్కా త్రిపాఠి, లక్ష్మణ్‌తో పాటు చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)