Breaking News

తమన్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన బాలయ్య.. ధర ఎంతంటే?

Published on Sat, 02/15/2025 - 11:17

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కి హీరో బాలకృష్ణ(Balakrishna) ఖరీదైన కారుని బహుమతి ఇచ్చాడు. న్యూ బ్రాండెండ్ పోర్స్చే కారుని బాలయ్య స్వయంగా కొని, రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు . దీని విలువ మార్కెట్‌లో కోటిన్నర వరకు ఉంటుంది. ప్రీమియంది అయితే దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందట. ఓ సంగీత దర్శకుడికి బాలయ్య ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం ఇదే మొదటి సారి.  కొత్త కారుతో బాలయ్య, తమన్‌ దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తమన్‌ రెచ్చిపోతాడు
బాలయ్య సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తే చాలు తమన్‌(Thaman) రెచ్చిపోతాడు. ఎంతలా అంటే ఆయన ఇచ్చే బీజీఎంకి థియేటర్స్‌లో బాక్సులు బద్దలైపోయేలా. అఖండ సినిమా భారీ విజయం సాధించడంలో తమనే కీలక పాత్ర పోషించాడు. అదిరిపోయే పాటలతో పాటు అద్భుతమైన బీజీఎం అందించాడు. 

ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరీ చిత్రాలకు కూడా అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. వీరసింహారెడ్డి బీజీఎం ఇప్పటికీ ఫ్యాన్స్‌ ఫేవరేట్‌. సోషల్‌ మీడియాలో బాలయ్య ఎలివేషన్‌ వీడియోలన్నింటికి ఈ మూవీ బీజీఎంనే వాడుతారు. ఇక ఇటీవల రిలీజైన డాకు మహారాజ్‌కు కూడా తమన్‌ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. అందుకే బాలయ్యకు తమన్‌ అంటే విపరీతమైన ప్రేమ. ముద్దుగా తమ్ముడు అని పిలుచుకుంటాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అఖండ 2’ చిత్రం తెరకెక్కుతుంది. 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)