Breaking News

మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు!

Published on Mon, 01/13/2025 - 11:36

‘దబిడి దిబిడి’ పాట స్టెప్పులపై సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్‌ జరిగిందో అందరికి తెలిసిందే. సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు కూడా ఆ స్టేప్పులను తప్పుపట్టారు. అయితే ఇందులో బాలయ్య కంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌నే ఎక్కువగా ట్రోల్‌ చేశారు. ఓ ఎమ్మెల్యే, సీనియర్‌ హీరో అయిన బాలకృష్ణతో అలాంటి అసభ్యకరమైన స్టెప్పులేయించాండంటూ శేఖర్‌ మాస్టర్‌ను ఏకిపారేశారు. మరికొంతమంది నెటిజన్స్‌ అయితే కూతురు వయసు ఉన్న ఊర్వశీ రౌతేలాతో బాలయ్య అలాంటి స్టెప్పులేయడం అసభ్యకరంగా ఉందని కామెంట్‌ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌ని చిత్ర యూనిట్‌తో సహా బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఓ పార్టీ ఈవెంట్‌లో ఊర్వశీతో బాలయ్య మళ్లీ అదే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

సక్సెస్‌ పార్టీతో వికృత స్టెప్పులు!
హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj). ప్రగ్యా జైశ్వాల్‌, శ్రధ్ధాశ్రీనాథ్‌ హీరోయిన్‌. . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో యూనిట్‌ అంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఓ హోటల్‌లో జరిగిన ఈ పార్టీకి బాలయ్యతో సహా చిత్రబృందం అంతా హాజరైంది. ఈ సందర్భంగా ఊర్వశీతో బాలయ్య స్టెప్పులేశాడు. ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్‌ చేస్తూ మళ్లీ అసభ్యకరమైన స్టెప్పులేశారు. బాలయ్య ఆ స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశీ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశీ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయింది. 

 

ముద్దులతో ముంచేసిన బాలయ్య
`డాకు మహారాజ్‌`పార్టీలో యంగ్‌ హీరోలు విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముద్దులతో ముంచేశాడు బాలకృష్ణ. సక్సెస్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తూ `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్‌` అని విశ్వక్‌ సేన్‌ అనగా.. థ్యాంక్యూ ‘లైలా ’అంటూ విశ్వక్‌ సేన్‌కి బాలయ్య ముద్దు పెట్టాడు. విశ్వక్‌ కూడా తిరిగి బాలయ్యకు ముద్దు పెట్టారు. పక్కనే ఉన్న సిద్దు కూడా ‘నాకు పెట్టలేదు(కిస్‌) అనగానే..బాలయ్య లాక్కొని సిద్దుకి కూడా కిస్‌ ఇచ్చాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు దర్శకుడు బాబీకి కూడా కిస్‌  ఇచ్చాడు బాలయ్య. పార్టీ మూడ్‌లో బాలయ్య ఇలా రెచ్చిపోవడంతో ఆ వీడియోలన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)