ఏప్రిల్‌లో ఆదిత్య 369

Published on Wed, 03/19/2025 - 00:11

హీరో బాలకృష్ణ కెరీర్‌లోని విజయవంతమైన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ఇది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం 1991లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 11న రీ రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ చిత్రాన్ని 4కేలో డిజిటలైజ్‌ చేశాం. సౌండ్‌ని కూడా 5.1 క్వాలిటీలోకి మార్చాం. 

34 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్‌ ఉంది. ఇప్పటి ట్రెండ్‌కి కూడా కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఈ చిత్రాన్ని నేను నిర్మించడానికి ఎంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నామని చెప్పగానే బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావుగార్లు ఎగ్జయిట్‌ అయ్యారు.

ఇళయరాజాగారి సంగీతం, జంధ్యాలగారి మాటలు, పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్‌ స్వామి, కబీర్‌ లాల్‌ ఛాయాగ్రహణం ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఇప్పటి వరకు 15 సినిమాలు నిర్మించినప్పటికీ నాకు మంచి గుర్తింపుని, మా శ్రీదేవి మూవీస్‌ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన చిత్రం ‘ఆదిత్య 369’’ అన్నారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)