Breaking News

‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు

Published on Fri, 04/07/2023 - 12:07

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొడుతుంది. ఈ మూవీ డైరెక్టర్‌ ఓ హాస్యనటుడు‌ కావడం విశేషం. వెండితెర, బుల్లితెరపై కమెడియన్‌గా అలరించిన వేణు యెల్డండిలీ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కేవలం మౌత్‌ టాక్‌తోనే బలగం మంచి వసూళ్లు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సినిమా మంచి విజయం సాధించాలన్న, ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే భారీ బడ్జెట్‌ పెట్టాల్సిన అవసరం లేదని, కథ ఉంటే చాలని మరోసారి బలగం నిరూపించింది. కేవలం రూ. 2 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ. 25 కోట్లపైనే కలెక్షన్స్‌ రాబట్టింది. అంతేకాదు ఈ మూవీ వరుసగా అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ డైరెక్టర్‌ వేణు తొలిప్రయత్నంలోనే ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును సాధించాడు.

ఉత్తమ దర్శకుడిగా వేణు ఆమ్‌ స్టర్‌ డామ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డుకు అందుకున్నాడు. కాగా ఇప్పటికే బలగం లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులు అందుకున్న ఈ మూవీకి మరో ఇంటర్నేషనల్‌ అవార్డు దక్కడం విశేషం. 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)