Breaking News

తాగుడుకు బానిసయ్యా.. అసలు ఈ బతుకు ఎందుకు అనుకున్నా?: కమెడియన్‌

Published on Mon, 04/24/2023 - 15:10

తనదైన బాడీ లాంగ్వేజీతో, తెలంగాణ యాసలో డైలాగులు పలికిస్తూ నవ్వించగల వ్యక్తి కర్తానందం. జబర్దస్త్‌ స్టేజీపై కమెడియన్‌గా సత్తా చాటిన ఆయన వెండితెరపై కూడా నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బలగం, దసరా సినిమాల్లో నటించి మరింతమంది ప్రేక్షకులకు దగ్గరైన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్తూ కన్నీటిపర్యంతమయ్యాడు.

'మాది సూర్యాపేట. ఖమ్మంలో పదవ తరగతి వరకు చదువుకున్నా. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లి. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. మా ఐదుగురిని అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని పోషించింది. తను ఇప్పుడు లేదు, కానీ తన గురించి తలుచుకుంటే కన్నీళ్లాగవు. నేను చిన్నతనం నుంచే నాటకాలు వేసేవాడిని. చదువుకునే వయసులోనే జలగం వెంగళ్రావు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో కూలీ పనులు చేశాను. ఎన్నో బాధలు అనుభవించాను. ఈ పరిస్థితుల్లో తాగుడుకు బానిసయ్యాను. ఏ పని చేసినా కలిసిరాలేదు. రోడ్డు పక్కన ఎంగిలి బీడీలు ఏరుకుని తాగాను. ఎందుకు ఈ బతుకు? అనిపించింది. కానీ ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. సాయం కోసం మా ఫ్రెండ్స్‌ను ఆశ్రయించాను.

అప్పుడు పోలీస్‌ శాఖ ప్రతి జిల్లాకు కళాబృందాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసింది. వారు నన్ను ఆ కళాబృందానికి హోంగార్డుగా పనిచేయమన్నారు. 22 సంవత్సరాలు అదే ఉద్యోగం చేసి కొంతకాలం క్రితమే రిటైరయ్యాను. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన బోలెడన్ని సినిమాల్లో నటించాను. చాకలి ఐలమ్మ సినిమాలో జబర్దస్త్‌ రాజమౌళితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా వేణు టీమ్‌లో చేరాను. దాదాపు 200 ఎపిసోడ్లు చేశాను. నన్ను బుల్లితెరకు పరిచయం చేసిన వేణు బలగం సినిమాలోనూ అవకాశం ఇచ్చాడు. ఆయన నా దేవుడు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను' అంటూ కంటతడి పెట్టుకున్నాడు కర్తానందం.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)