Breaking News

తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి

Published on Thu, 04/13/2023 - 21:38

థియేటర్‌లోనే కాదు ఓటీటీలోనూ అదరగొడుతోంది బలగం సినిమా. మార్చి 3న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు రావడంతో పాటు పెద్దపెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కొమురయ్య చెల్లి పోశవ్వ పాత్రను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే అందరినీ ఓ కంట కనిపెడుతూ, అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది. 

ఈ పాత్రలో అద్భుతంగా నటించిన విజయలక్ష్మి తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'నేను నాటకాలు వేస్తుంటాను. నంది సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. హరికథలు కూడా చెప్పేదాన్ని. నేను చేసిన తొలి చిత్రం బలగం. ఇది యదార్థంగా జరుగుతున్న కథ. నాకు ఈరోజు ఇంతమంచి పేరు రావడానికి కారణం వేణుగారే. ఈ సినిమా సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు.

ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. నా భర్త చనిపోయాక నా పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదమది. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం, ఆయన మరణించిన నాలుగేళ్లకు చేతికందిన కొడుకు అకస్మాత్తుగా ప్రాణాలు వదలడంతో ఎంతో బాధపడ్డాను. ఆ సంఘటన నుంచి నేనింతవరకు తేరుకోలేకపోతున్నాను' అంటూ ఎమోషనలైంది విజయ లక్ష్మి.​

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)