Breaking News

చిరిగిన బట్టలు వేసుకునేవాడిని, ఎన్నో అవమానాలు: బలగం నటుడు

Published on Thu, 04/06/2023 - 21:27

బంధాల్ని నిలుపుకోవడం, వాటిని కలకాలం కాపాడుకోవడమే బలం అని నిరూపించాడు దర్శకుడు వేణు. బలగం సినిమాతో కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కట్టినట్లు చక్కగా చూపించాడు. ఈ సినిమాలో నారాయణ పాత్రలో మెప్పించాడు మురళీధర్‌ గౌడ్‌. తాజాగా ఆయన తన జీవితంలో ఎదురుచూసిన చేదు సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

'మెదక్‌ జిల్లా రామాయంపేట నా స్వస్థలం. సిద్దిపేటలో చదువుకున్నాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్లు పనిచేసి రిటైరయ్యాను. మేము నలుగురం అన్నదమ్ములం, ఒక చెల్లె. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా ఇంట్లో పది రూపాయలు ఉండేవి కాదు. మా కోసం అమ్మానాన్న పడ్డ కష్టాలు కళ్లారా చూశాను. ఓసారి పది రూపాయలు అవసరమయ్యాయి. అమ్మ ఎవరినీ అడగలేక మా బంధువుల్లో కొంత ధనవంతుల ఇంటికి నన్ను రూ.10 అప్పు తీసుకురమ్మని పంపించింది.

నాకేమో వాళ్లు ఇస్తారో, ఇవ్వరోనని భయపడుతూనే వెళ్లి అడిగేవాడిని. మా నాన్న మాకు దూరంలో పని చేసేవాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ పది రూపాయలు వాళ్లకు తిరిగి ఇచ్చేవాడిని. చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని. ఎగతాళి చేసేవారు. దారుణంగా అవమానించేవారు. నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా పరిస్థితి అంతంతమాత్రమే! నేను రిటైర్‌మెంట్‌ తీసుకున్నప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్‌ జీరో' అంటూ కంటతడి పెట్టుకున్నాడు.​

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)